ప్రజావాణిలో 257 అర్జీలు

– సమస్యల పరిష్కారానికి నేరుగా అధికారులకు ఫోన్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23: రాష్ట్ర ప్రభుత్వం మ‌హాత్మా జ్యోతిరావుబాఫూలే ప్ర‌జాభ‌వ‌న్‌లో ప్రతి వారం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మంగళవారం 257 అర్జీలు వచ్చాయి. వాటిలో గృహ సంబంధిత దరఖాస్తులు 38, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 108 అర్జీలు, రెవెన్యూ శాఖకు సంబంధించి అర్జీలు వచ్చాయి. కాగా, ప్రవాసి ప్రజావాణిలో ఒక అర్జీ నమోదు అయింది. ఇతర శాఖలకు సంబంధించి 64 అర్జీలు వచ్చాయని ప్రజావాణి అధికారులు తెలిపారు. వ‌చ్చిన అర్జీల‌పై ప్ర‌జావాణి అధికారులు సంబంధిత శాఖ‌ల అధికారుల‌కు నేరుగా ఫోన్లు చేసి స‌మ‌స్య‌ల ప‌రిష్కారినికి చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌న్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *