రాజస్థాన్ తరహాలో ‘ప్రజా సూచన్ పోర్టల్’

– సీఎంకు సామాజిక కార్యకర్త నిఖిల్ డే సూచన

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 26: రాజస్థాన్ ప్రభుత్వం చేపడుతున్న జన్ సూచన పోర్టల్ తరహాలో తెలంగాణలోనూ ప్రజా సూచన పోర్టల్ ఏర్పాటు చేయాలని ప్రముఖ సామాజిక కార్యకర్త నిఖిల్ డే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సూచించారు. శాసనమండలి కాన్ఫరెన్స్ హాల్‌లో ముఖ్యమంత్రిని  నిఖిల్ డే బృందం కలిసింది. ఈ సందర్భంగా వారిమధ్య పలు అంశాలపై చర్చ జరిగింది. వివిధ శాఖల ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపడుతున్న అన్ని పథకాలకు సంబంధించిన వివరాలను ఒకేచోట ఈ పోర్టల్‌లో అందుబాటులో ఉంచవచ్చన్నారు. ఐటీ శాఖ ద్వారా ఈ పోర్టల్‌ను అభివృద్ధి చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కార్యక్రమాలను ప్రశంసించిన నిఖిల్ & ûప్రస్తుతం రాష్ట్రస్థాయిలో చేపడుతున్న ప్రజావాణి కార్యక్రమాన్ని రెవెన్యూ డివిజన్ స్థాయికి తీసుకెళ్ళేందుకు సమాలోచన చేశారు. అందుకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. తెలంగాణ గిగ్ వర్కర్స్ బిల్లును నిఖిల్ డే ప్రశంసించారు. ఈ బిల్లు దేశంలోనే చరిత్రాత్మకంగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు దాన కిషోర్, వి.శేషాద్రి, బి.అజిత్ రెడ్డి, మాణిక్ రాజ్, దివ్య దేవరాజన్, వేముల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *