నాల్గవ ఆర్థిక శక్తిగా భారత్‌

– ఓర్వలేని వారి కుట్రలను తిప్పికొట్టాలి
కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి
హైదరాబాద్‌,ప్రజాతంత్ర,ఆగస్ట్‌30:భారత దేశం గత దశాబ్ద కాలంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ ఉందని ప్రపంచంలోనే నాల్గవ ఆర్థిక శక్తిగా ఎదిగిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి అన్నారు. దీన్ని చూసి ఓర్వలేనివారి కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్‌ కాచిగూడ లోని ఉత్తరాది మఠాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా  సత్య ప్రమోద తీర్థ స్వామీజీ 108 కాయిన్‌ను ఆయన ఆష్కరించారు.  ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ  సత్య ప్రమోద స్వామీజీ 50 ఏళ్ల తన పీఠాధిపతి హయాంలో దేశవ్యాప్తంగా పల్లె పల్లెలో పర్యటిస్తూ సనాతన ధర్మ ప్రచారాన్ని చేయడమే కాకుండా ప్రజలందరిని ఏకతాటిపై నడిపించేందుకు ఎంతో కృషి చేశారన్నారు.  ప్రస్తుత పీఠాధిపతి  సత్యాత్మ తీర్థ శ్రీపాదులు కూడా తమ గురువులుసత్య ప్రమోదుల బాటలోనే నడుస్తూ దేశవ్యాప్తంగా పర్యటిస్తూ సనాతన ధర్మ ప్రచారానికి రోజుకు 20 గంటలు కష్టపడుతున్నారన్నారు. ఇలాంటి ధర్మబద్ధులైన స్వామీజీలు భారతదేశ ప్రగతికి మూల స్తంభాలని త్వరలో భారతదేశ గురువుగా మారుతుందని అన్నారు. ఉత్తరాది మఠం పీఠాధిపతి సత్యాత్మ తీర్థ శ్రీపాదులు మాట్లాడుతూ  తమ మఠం ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఉపాధి ఉపాధి, ఉద్యోగం, ఆరోగ్యం కల్పన తో పాటు దేశవ్యాప్తంగా అనేక గురుకులాలు ఏర్పాటు చేసి సనాతన ధర్మ ప్రచారకులను వేలాది మందిని తయారు చేస్తున్నట్లు చెప్పారు.  కర్ణాటక హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి దినేష్‌ కుమార్‌ మాట్లాడుతూ ఉత్తరాది మఠంతో తనకు ఆరేడు దశాబ్దాలుగా మంచి సంబంధాలు ఉన్నాయని సత్య ప్రమోద తీర్థ శ్రీపాదులు ఎన్ని కష్టాలు వచ్చినా ప్రజలకు అండగా నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మోస్‌ సీఈఓ ఎం డి జయతీర్థ శ్విద్యాధీశ ఆచార్య,  సత్య ధాన కట్టి ఆచార్య  శశి ఆచార్య,  జయతీర్థ ఆచార్య,  రాఘవేంద్ర చార్య తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.  అంత‌కుముందు కేంద్ర మంత్రి ప్ర‌హ్లాద్ జోషి బాలాన‌గ‌ర్ గ‌ణేశుడిని ద‌ర్శించుకున్నారు. అక్క‌డ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎన్‌.రామ‌చంద‌ర్‌రావుతో క‌లిసి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు.
————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *