నేడు హైద‌రాబాద్‌కు కేంద్ర‌ మంత్రి ప్రహ్లాద్ జోషి

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 29:  కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి శ‌నివారం హైదరాబాద్ రానున్నారని ఉత్త‌రాది మ‌ఠం నిర్వాహ‌కులు ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. హైదరాబాదులో చాతుర్మాస్య దీక్షకు కూర్చున్న ఉత్తరాది మఠం  సత్యప్రమోద తీర్థ స్వామీజీ దర్శనం చేసుకుంటారు. ఈ సందర్భంగా  ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సత్యప్రమోద తీర్థ స్వామీజీ  నాణేన్ని కేంద్ర మంత్రి ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన‌నున్నారు. హైదరాబాద్ కాచిగూడలోని ఉత్తరాది మఠంలో శ‌నివారం సాయంత్రం 4 గంటలకు ఈ కార్య‌క్ర‌మం జ‌రుగుతుంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *