– ఫోన్ ట్యాపింగ్, హార్డ్ డిస్క్‌ల ధ్వంసంపై విచారణ
హైదరాబాద్, డిసెంబర్ 12 (ఆర్‌ఎన్‌ఎ): ఫోన్ ట్యాపింగ్ కేసులోఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ ముందు లొంగిపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో దర్యాప్తు అధికారి ఏసీపీ వెంకటగిరి ముందు ప్రభాకర్‌రావు సరెండర్ అయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ప్రభాకర్ రావును సిట్ అధికారులు ఆరు సార్లు విచారణ జరిపిన విషయం తెలిసిందే. అయితే సిట్ విచారణకు ప్రభాకర్ సహకరించకపోవడంతో కస్టోడియల్ విచారణకు ఇవ్వాలని సుప్రీంకోర్టును ప్రభుత్వం ఆశ్రయించింది. దీంతో ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణకు సుప్రీం ధర్మాసనం అనుమతి ఇచ్చింది. ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఎస్‌ఐబీ మాజీ చీఫ్ సిట్ ముందు సరెండర్ అయ్యారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ప్రభాకర్ రావు విచారణ కొనసాగుతోంది. మే 29 నుంచి ఇప్పటివరకు సుప్రీం కోర్టు కల్పించిన మధ్యంతర రక్షణలోనే ప్రభాకర్ రావు ఉన్నారు. అరెస్ట్ కాకుండా ఆరుసార్లు విచారణకు వచ్చారు. అయితే ఈ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం కీలక అఫిడవిట్‌ను దాఖలు చేసింది. మధ్యంతర రక్షణ కల్పించడంతో కేసు విచారణకు ప్రభాకర్ రావు సహకరించడం లేదని కస్టోడియల్ విచారణకు అనుమతి ఇవ్వాలని, ఈ విచారణ జరిగితే తప్ప ప్రభాకర్ నుంచి ఆధారాలు రాబట్టలేమని సుప్రీం కోర్టులో ప్రభుత్వం వాదనలు వినిపించింది. ఉన్నతన్యాయస్థానం ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణకు అనుమతి ఇవ్వడంతో ఆయన లొంగిపోయారు. ఈరోజు ప్రభాకర్ రావు అరెస్ట్ చూపిన తర్వాత ఏడు రోజుల కస్టోడియల్ విచారణ కొనసాగనుంది. కస్టోడియల్ విచారణ రిపోర్టును సుప్రీం కోర్టుకు సిట్ సమర్పించనుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.