తెలంగాణ‌, రాజ‌స్థాన్ ల ఉమ్మ‌డి విద్యుత్ ప్రాజెక్టులు

– సింగ‌రేణితో రాజ‌స్థాన్ విద్యుత్ సంస్థ ఒప్పందం
– 2300 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం
– రాజ‌స్థాన్  విద్యుత్ మంత్రి హీరాలాల్ న‌గ‌ర్‌
– డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌కు లేఖ అంద‌జేత‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 4: సింగరేణి సంస్థతో కలిసి రాజస్థాన్‌ రాజ్య విద్యుత్‌ ఉత్పాదన్‌ నిగం లిమిటెడ్‌ 2,300 మెగావాట్ల విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణానికి రాజస్థాన్‌ కేబినెట్‌ ఇటీవల ఆమోదం తెలిపిందని ఆ రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి హీరాలాల్‌ నగర్‌ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో ఆయన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లును గురువారం కలిశారు. ఈ మేరకు ఒక లేఖను అందించి ఉమ్మడి విద్యుత్‌ ప్రాజెక్టులపై చర్చించారు. సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌తో కలిసి తమ రాష్ట్ర విద్యుత్‌ ఉత్పాదన్‌ నిగం లిమిటెడ్‌ 1,500 మెగావాట్ల సోలార్‌, 800 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్తు ఉత్పాదన కోసం ఒప్పందం కుదుర్చుకున్నదన్నారు. దీనికి తమ రాష్ట్ర కేబినెట్‌ వెంటనే అనుమతి మంజూరు చేసిందని తెలిపారు. రెండు రాష్ట్రాల విద్యుత్‌ అవసరాలకు ఈ ప్రాజెక్టులు ఎంతో దోహదపడనున్నందున వీటిని త్వరగా పూర్తి చేయాల్సి ఉంందన్నారు. కాగా, సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా తొలిసారిగా ఇతర రాష్ట్రమైన రాజస్థాన్‌తో ఒప్పందం కుదుర్చుకుందని, ఈ తరహాలో ఇతర రాష్ట్రాలతో కూడా గ్రీన్‌ ఎనర్జీ ప్లాంట్‌ ఏర్పాటుకు సన్నాహాలు జరుపుతుందని భట్టి పేర్కొన్నారు. చర్చలలో రాజస్థాన్‌కు చెందిన కాలూరామ్‌, ప్రమోద్‌ శర్మ, సింగరేణి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ ఈడీ చ్రిరంజీవి, జీఎం(కో ఆర్డినేషన్‌) టి.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *