మేడారం జాత‌ర పోస్ట‌ర్‌, బ్రోచ‌ర్ ఆవిష్క‌రించిన సీఎం

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 12ః ఈనెల 28 నుంచి 31వ తేదీ వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న మేడారం స‌మ్మ‌క్క‌-సార‌క్క మ‌హా జాత‌ర‌కు సంబంధించి గిరిజ‌న‌ సంక్షేమ శాఖ మేడారం మహా జాతర బ్రోచర్, పోస్టర్ రూపొందించింది. వీటిని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్‌రెడ్డి సోమ‌వారం ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో గిరిజ‌న సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల మంత్రి ద‌న‌స‌రి అన‌సూయ సీత‌క్క‌, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *