ప్రజామోద బడ్జెట్

– వ్యవసాయానికి పెద్దపీట, అభివృద్ధికి భారీ కేటాయింపులు
– వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

వనపర్తి, ప్రజాతంత్ర మార్చి 20: రాష్ట్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రజా ఆమోద బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో శుక్రవారం ప్రవేశపెట్టారని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు.ఈ బడ్జెట్‌లో మొత్తం రూ.3,24,234 కోట్ల వ్యయాన్ని ప్రతిపాదించగా, అందులో మూలధన వ్యయం రూ.47,267 కోట్లు, రెవెన్యూ వ్యయం రూ.2,34,406 కోట్లుగా కేటాయించినట్లు ఆయన వెల్లడించారు.రాష్ట్రంలో ముఖ్యంగా వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ రూ.23,179 కోట్లు కేటాయించడం గమనార్హమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. విద్యుత్ శాఖకు రూ.21,285 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు రూ.33,688 కోట్లు, ఇరిగేషన్‌కు రూ.22,615 కోట్లు కేటాయించడం ద్వారా గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చినట్లు ఆయన తెలిపారు.విద్యా రంగానికి రూ.26,674 కోట్లు, వైద్య ఆరోగ్య శాఖకు రూ.13,679 కోట్లు కేటాయించడం ద్వారా సామాజిక రంగాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. అలాగే పౌర సరఫరాలకు రూ.7,366 కోట్లు, పశుసంవర్ధక శాఖకు రూ.1,529 కోట్లు, మహిళా శిశు సంక్షేమానికి రూ.3,143 కోట్లు కేటాయించారు.సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం షెడ్యూల్డ్ కులాలకు రూ.11,784 కోట్లు, షెడ్యూల్డ్ తెగలకు రూ.7,937 కోట్లు, బీసీలకు రూ.12,511 కోట్లు, మైనార్టీలకు రూ.3,769 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు.ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీలకు రూ.50,713 కోట్లు కేటాయించగా, రైతు భరోసాకు రూ.18,000 కోట్లు, చేయూతకు రూ.14,861 కోట్లు, ఇందిరమ్మ ఇళ్లకు రూ.5,500 కోట్లు, మహాలక్ష్మి పథకానికి రూ.4,305 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అదనంగా గృహ జ్యోతి పథకానికి రూ.2,080 కోట్లు, రాజీవ్ ఆరోగ్య శ్రీకి రూ.1,143 కోట్లు కేటాయించారని చెప్పారు.పవర్ సబ్సిడీకి రూ.14,000 కోట్లు, బియ్యం సబ్సిడీకి రూ.3,000 కోట్లు, కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్ పథకాలకు రూ.3,683 కోట్లు కేటాయించడం ద్వారా సంక్షేమానికి పెద్దపీట వేసినట్లు ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు.ఇక మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా రోడ్లు, భవనాల శాఖకు రూ.12,789 కోట్లు, పురపాలక పట్టణాభివృద్ధికి రూ.17,907 కోట్లు, రీజనల్ రింగ్ రోడ్‌కు రూ.1,525 కోట్లు కేటాయించారని తెలిపారు. పర్యాటక రంగానికి రూ.1,224 కోట్లు, పరిశ్రమల అభివృద్ధికి రూ.3,490 కోట్లు కేటాయించడం ద్వారా రాష్ట్ర ఆర్థిక వృద్ధికి బలం చేకూరుతుందని అన్నారు.ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఈ బడ్జెట్ దోహదపడుతుందని ఎమ్మెల్యే మేఘారెడ్డి పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *