అమరుల ఆశయాలను కొనసాగిస్తున్నాం

– సిద్దిపేటలో జెండా ఎగురేసిన మంత్రి పొన్నం ప్రభాకర్‌

‌సిద్దిపేట,ప్రజాతంత్ర,సెప్టెంబర్‌17: ‌తెలంగాణ ఉద్యమం అనేది నీళ్ళు, నిధులు, నియామకాలు, ప్రతేక్య రాష్ట్రం కోసం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌తెలిపారు. ప్రజల ఆకాంక్షలతో  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా కలెక్టరేట్‌ ‌లో జాతీయ జెండాను పొన్నం ప్రభాకర్‌ ఆవిష్కరించారు. అనంతరం బైరాన్‌ ‌పల్లి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. 1948 ఆగస్ట్ 27‌న వందలాది మంది అసువులు బాసిన అమరులకు నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులకు, తెలంగాణ అమరవీరులకు జోహార్లు అని అన్నారు. సెప్టెంబర్‌ 17 ‌తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రజా పాలన దినోత్సవం గా జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి నాయకత్వంలో అమరుల ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నామని స్పష్టం చేశారు.  ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ‌హైమవతి, అడిషనల్‌ ‌కలెక్టర్‌ ‌గరిమ అగర్వాల్‌, ‌సిపి అనురాధ, ఇతర అధికారులు పాల్గొన్నారు. సెప్టెంబర్‌ 17 ‌తెలంగాణ విలీనం సందర్భంగా సిద్దిపేట జిల్లా వీర బైరాన్‌ ‌పల్లి అమరవీరుల స్థూపం, చారిత్రాత్మక బురుజు వద్ద ఎంపి చామల కిరణ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, డిసిపి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్‌ ‌రెడ్డి, పూజల హరికృష్ణ, ఇతర ముఖ్య నేతలతో కలిసి అమరవీరులకు నివాళులర్పించడం జరిగింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *