– 13న హైదరాబాద్‌లో అందజేత
కాళోజి జంక్షన్/హనుమకొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 8 : తెలుగు సాహిత్యంలో విశిష్ట సేవలందిస్తున్న ప్రముఖ రచయిత అంపశయ్య నవీన్, కళా రంగంలో విశిష్టమైన కృషిచేసిన అంతడుపుల రమాదేవిలకు పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారం అందజేస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి పొన్నం సత్తయ్య గౌడ్ చారిటబుల్ ట్రస్టు ప్రకటించింది. ఏటా రచయితలకు, కళాకారులకు అందించే పొన్నం సత్తయ్య జీవిత సాఫల్య పుర స్కారాలకు ఈ ఏడాది సాహిత్యం విభాగంలో ప్రముఖ నవలా రచయిత అంపశయ్య నవీన్, కళా రంగంలో ల రమాదేవి ఎంపికయ్యారని కమిటీ కన్వీనర్ డాక్టర్ పొన్నం రవిచంద్ర సారధ్యంలో కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్, సీనియర్ జర్నలిస్ట్ దిలీప్ రెడ్డి, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, రచయిత్రి అయినంపూడి శ్రీలక్ష్మిలు ఎంపిక చేసి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఎంపిక పత్రాన్ని అందచేశారు. గత మూడేళ్లు ఈ అవార్డులను సాహిత్య విభాగంలో నాళేశ్వరం శంకరం, నలిమెలా భాస్కర్, చంద్రబోస్‌లు అందుకోగా కళాకారుల విభాగంలో ఒగ్గు ధర్మయ్య, కామ్రేడ్ విమలక్క, బలగం ఫేమ్ కొమురమ్మ అందుకున్నారు. పొన్నం సత్తయ్య 15వ వర్ధంతి సందర్భంగా ఈనెల 13వ తేదీ సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతిలో ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. అవార్డు గ్రహీతలకు రూ.51 వేల నగదుతో పాటు మెమెంటో, ప్రశంసా పత్రాన్ని అందిస్తారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





