– బీజేపీకి మంత్రి పొన్నం ప్రభాకర్ వినతి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 14: తెంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పాం.. అధికారంలోకి రాగానే న్యాయపరమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి కుల సర్వే చేయించాం అని బీసీ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. సోమవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ కోర్టు ఆదేశాల మేరకు, ప్రామాణిక సర్వే ప్రకారం గతంలో ఈడబ్లూఎస్ రిజర్వేషన్లు, న్యాయమూర్తుల సలహాలు తీసుకుని శాసన సభలో తీర్మానం చేసి బిల్లును గవర్నరు ద్వారా అక్కడి నుండి రాష్ట్రపతికి పంపామని ఆయన వివరించారు. బీజేపీ జాతీయ ఓబీసీ అధ్యక్షుడు లక్ష్మణ్ బీసీల రిజర్వేషన్‌పై అసహనం వ్యక్తం చేస్తున్నారంటూ ఆ రిజర్వేషన్ల కోసం స్థానిక సంస్థల ఎన్నికలను 18 నెలలుగా వాయిదా వేసుకుంటూ పోయాం.. మీరే స్థానిక సంస్థలకు నిధులు ఆపారు అంటూ బీసీ వర్గాల పట్ల మీకున్న అభిప్రాయాలు ఏమిటి అని మంత్రి పొన్నం నిలదీశారు. రిజర్వేషన్లు కాపాడడానికి తెలంగాణ ఉద్యమంలో జేఏసీగా ఏర్పడినట్లు ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు సాధిస్తామన్నారు. రిజర్వేషన్లను మీరు వ్యతిరేకిస్తే మీ పార్టీలో మిమ్మల్నే వ్యతిరేకించే పరిస్థితి వస్తుందన్నారు. బీజేపీ నేతలు మాటలు చాలించి రాష్ట్రపతి దగ్గరకు వెళ్లి బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో చేర్పించండి అని హితవు పలికారు. మొన్న ఐదు ఎమ్మెల్సీలు బలహీనవర్గాలకు వచ్చాఅస్త్రఓశీ అది కులగణన ద్వారా సాధ్యమైందని మంత్రి పొన్నం చెప్పారు. బీఆర్‌ఎస్‌లో ఉన్న బీసీ నేతలూ.. మీ పార్టీ అధ్యక్ష పదవికి బీసీ, ఎస్సీలలో అర్హులే లేరా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్, బీజేపీలు రిజర్వేషన్లకు అడ్డుపడితే తెలంగాణ బీసీ వర్గాలు ఐక్యమై రిజర్వేషన్లను కాపాడుకునే బాధ్యత బీసీ మేధావులు, రాజకీయ నాయకులు, కుల సంఘాలపై ఉందన్నారు. తాము దిల్లీకి రావడానికి సిద్ధంగా ఉన్నామని, మీ పార్టీ కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు కలిసి దిల్లీకి తీసుకెళ్లి బిల్లును పాస్ చేయించండి అని విజ్ఞప్తి చేశారు. శాసనసభ రన్నింగ్‌లో లేనపుడు ప్రభుత్వాలకు ఆర్డినెన్స్ తెచ్చే హక్కు ఉంటుందన్నారు. రిజర్వేషన్లు అమలుకు న్యాయపరమైన చిక్కులు లేకుండా చూస్తున్నామన్నారు. ఇక్కడ కులగణన విప్లవాత్మక నిర్ణయమని వారణాసి ప్రజాప్రతినిధి, ఆర్‌ఎస్‌ఎస్ నేత అన్నారు.. స్వయం సేవక్ సంఫ్‌ు, విశ్వహిందూ పరిషత్ వాళ్లు కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దానిని స్వాగతిస్తున్నారన్నారు. దురాలోచనాపరుల బుద్ధులు మారాలని అమ్మవారిని వేడుకుంటూ 42 శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు కావాలని కోరుకుంటున్నామని పొన్నం చెప్పారు. బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, ఆర్.కృష్ణయ్య, లక్ష్మణ్.. మీరు బీసీ బిడ్డలు.. బీసీలకు అన్యాయం జరగకుండా చూడండి అని విజ్ఞప్తి చేశారు. రిజర్వేషన్ల అమలుకు ప్రధానమంత్రిని కలవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
మహిళల పట్ల అలా మాట్లాడడం సరైంది కాదు
మహిళల పట్ల కాంగ్రెస్ పార్టీకి అపారమైన గౌరవం ఉంది.. మహిళల పట్ల అలా మాట్లాడడం సరైంది కాదు అని నిన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితపై తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు, ఆపై ఆయన కార్యాలయంపై జాగృతి కార్యకర్తల దాడులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రస్తావించారు. ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ, ప్రజాస్వామ్యవాదులు ఖండిస్తున్నారన్నారు. తాము ఎవరిపై దాడులు చేయడం లేదు.. బీసీ రిజర్వేషన్లపై విజ్ఞప్తి చేస్తున్నాం.. అభ్యర్థిస్తున్నాం అని చెప్పారు. 42 శాతం రిజర్వేషన్లకు ఎవరూ అడ్డంపడవద్దు అని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.


