బడ్జెట్లో రాష్ట్రానికి న్యాయం జరగాలి

– గతంలో కంటే ఈసారి కేటాయింపులు పెరగాలి
– అన్యాయం జరిగితే బీజేపీ ఎంపీలదే బాధ్యత
– మీడియాతో మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 31: కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రవేశపెట్టే బడ్జెట్ లో తెలంగాణను నిర్లక్ష్యం చేయొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వానికి వివక్ష ఉందన్నారు. దాని ని సరిదిద్ది కేటాయింపులు చేయాల్సి ఉంద న్నారు. తెలంగాణపై బడ్జెట్లో వివక్షత చూపి స్తే బీజేపీ ఎంపీలే బాధ్యత వహించాలని చె ప్పారు. శనివారం గాంధీభవన్లో మంత్రి పొ న్నం ప్రభాకర్ డియాతో మాట్లాడారు. ఈ పౌర్ణమి తెలంగాణకు వెలుగులు తెస్తుందా..?, చీకటి ఇస్తుందా..? చూడాలని అన్నారు. కేం ద్ర బడ్జెట్లో ప్రతిసారీ తెలంగాణకు అన్యా యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఈ బడ్జెట్లోనైనా తెలంగాణకు న్యా యం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డి మాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటు, ఉద్య మం పట్ల ప్రధాని నరేంద్రమోదీకి వ్యతిరేకత ఉందన్నారు. రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన వంటి తెలంగాణ ప్రతిపాద నలపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పం దించాలని సూచించారు. ఈ విషయంపై కేం ద్రానికి, బీజేపీకి చివరిసారిగా గుర్తు చేస్తున్నా మని పేర్కొన్నారు. తెలంగాణలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నప్పటికీ కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించా రు. కేంద్ర విద్యాసంస్థల స్థాపనకు మోదీ ప్రభుత్వం సహకరించాలని కోరారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు తెలంగాణకి వస్తే తాము గౌరవంగా కలుస్తున్నామని ప్రస్తావిం చారు. పక్క రాష్ట్రాలకి నిధులు కేటాయిస్తే తాము తప్పు పట్టడం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *