-మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11: నల్ల రామయ్యపల్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించడమే కాదు, గ్రామంలో ఉన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం వెంకేపల్లి సైదాపూర్ మండలం నల్ల రామయ్యపల్లిలో రూ.20 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆయన గురువారం ప్రారంభించిన అనంతరం ప్రసంగించారు. గ్రామానికి అవసరమైన రోడ్ల నిర్మాణం జరుగుతోంది .బ్రిడ్జి టెండర్ పూర్తైంది. త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయన్నారు. నియోజకవర్గం లో ప్లాస్టిక్ వాడకుండా కాలుష్యాన్ని తగ్గించడానికి అన్ని గ్రామాలకు స్టీల్ బ్యాంక్ పంపిణీ చేస్తున్నామన్నారు. కోహెడ లో గవర్నర్ స్టీల్ బ్యాంక్ ప్రారంభించారు. నియోజకవర్గంలో ఉన్న అన్ని హోటళ్లకు స్టీల్ గ్లాస్ లు, స్టీల్ సామగ్రి పంపిణీ చేశాం. అంతా స్టీల్ సామగ్రి వాడాలన్నారు. గ్రామ పంచాయతీ భవనానికి భూమి విరాళం ఇచ్చిన చొక్కారావుకు అభినందనలు తెలిపారు. ప్రతి గ్రామంలో యువకులు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. యూరియా అందించడం కేంద్ర ప్రభుత్వం బాధ్యత. యూరియా కొరత అధిగమించాలని ముఖ్యమంత్రితో సహా అందరం మంత్రులం ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశామన్నారు. ఈ ఏడాది నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు. అర్హత ఉన్న వాళ్లందరికీ ఇల్లు వచ్చాయి.. అనర్హులకు ఎక్కడ ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఇంకా అర్హులైన ఇళ్లు లేనివారికి రెండవ విడతలో వస్తాయని హామీ ఇచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





