– అంచనా వేయించి పరిహారం అందేలా చూడాలి
– మంత్రి ఉత్తమ్‌కు మంత్రి పొన్నం, ఎమ్మెల్యే మేడిపల్లి వినతి
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29: భారీ వర్షాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా, సిద్దిపేట జిల్లా, హనుమకొండ జిల్లాలో భారీగా పంట నష్టం జరిగిందని బీసీ సంక్షేమం, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంలు నీటిపారుదల శాఖ మంత్రిని బుధవారం కలిసి వివరించారు. అధికారుల ద్వారా నష్టాన్ని అంచనా వేసి రైతులకు పరిహారం అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. పంట నష్టం జరిగిన రైతులను ఆదుకోవాలని మంత్రి ఉత్తమ్‌కు వినతి పత్రం సమర్పించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లాలో భారీగా పంట నష్టం జరిగిందని, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిందని చెప్పగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని మంత్రి ఉత్తమ్ హామీ ఇచ్చారు. మంత్రి పొన్నం విజ్ఞప్తి మేరకు కరీంనగర్, సిద్దిపేట, హనుమకొండ జిల్లాలో భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలపై ఆయా జిల్లాల కలెక్టర్లు పమేలా సత్పతి, హైమవతి, స్నేహ శబరీష్‌లతో టెలికాన్ఫరెన్స్‌లో మంత్రి ఉత్తవమ్ ూట్లాడారు. ఆ జిల్లాల్లో భారీ వర్షాలుతో దెబ్బతిన్న పంటలపై మంత్రులు ఆరా తీశారు. భారీ వర్షాల నేపధ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





