నిమజ్జనాలను పరిశీలించిన మంత్రి పొన్నం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6: నగరంలో గణేష్‌ నిమజ్జనం జరుగుతున్న నేపథ్యంలో హుస్సేన్‌ సాగర్‌తోపాటు పలు ప్రాంతాలను బీసీ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌ పరిశీలించారు. చాపర్‌ ద్వారా ఏరియల్‌ సర్వే నిర్వహించారు. ఆయనతోపాటు జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, డీజీపీ డాక్టర్‌ జితేందర్‌, నగర పోలీస్‌ కమిషనర్‌ సి.వి. ఆనంద్‌, జీహెచ్‌ఎంసి కమిషనర్‌ ఆర్‌.వి.కర్ణన్‌, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ హరిచందన దాసరి ఉన్నారు. కాగా, అంత‌కుముందు హుస్సేన్‌ ‌సాగర్‌ ‌వద్ద నిమజ్జనాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా పరిశీలించారు. భాగ్యనగర్‌ ఉత్సవ సమితి వేదికపై నుంచి భక్తులకు అభివాదం చేశారు. గణపతి బప్పా మోరియా టూ భక్తులతో కలిసి నినాదాలు చేశారు. క్రేన్‌ ‌నెం.4 వద్ద నిమజ్జనాలను పరిశీలించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *