బీసీ రిజర్వేషన్లపై చిత్త‌శుద్ధితో ఉన్నాం

– మంత్రి పొన్నం ప్రభాకర్‌

హైదరాబాదన, ప్రజాతంత్ర, ఆగస్టు 30: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని తమ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని బీసీ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌ స్పష్టం చేశారు. సెక్ర‌టేరియ‌ట్‌లో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసనరెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కామారెడ్డి డిక్లరేషన్‌ నుండి ఇంటింటా సర్వే చేసి సబ్‌ కమిటీ ఏర్పాటు చేసి కేబినెట్‌ ఆమోదం చేసుకొని శాసనసభలో చర్చించి అన్ని పార్టీల ఆమోదంతో గవర్నర్‌ ద్వారా బిల్లు రాష్ట్రపతి దగ్గరకు వెళ్లిందని తెలిపారు. స్థానిక సంస్థ‌ల‌కుసెప్టెంబర్‌ 30లోపు ఎన్నికలు పూర్తి చేయాలని కోర్టు సూచించిందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి చట్టాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఈ రిజర్వేషన్లపై డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో సబ్‌ కమిటీ ఇటీవల న్యాయకోవిదులతో చర్చించిందని, ఈ రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుందని ఆయ‌న చెప్పారు. ఎస్సీ, ఎస్టీ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉంటాయన్నారు. కేసీఆర్‌ 2018లో తెచ్చిన చట్టం ఉరితాడుగా మారిందని, 2018 పంచాయతీరాజ్‌ చట్టం, 2019లో మున్సిపల్‌ యాక్ట్‌ 50 శాతం సీలింగ్‌ ఎత్తివేయడానికి ఆర్డినెన్స్‌ తెచ్చామన్నారు. ఆర్డినెన్స్‌పై సభలో అన్ని పార్టీల నిరÊణయాలు తీసుకుని చర్చిస్తామన్నారు. బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లపై ముందుకు పోవడానికి నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సహచర మంత్రులు, పీసీసీ అధ్యక్షుడికి పొన్నం ధన్యవాదాలు తెలిపారు. బలహీన వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *