రిజర్వేషన్ల సాధనలో భాగస్వాములు కావాలి

– బీసీలకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ పిలుపు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 8: కుల గణన తరువాత విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించుకోవడానికి తెలంగాణ ఉద్యమం మాదిరి అన్ని వర్గాలు భాగస్వామ్యం కావాలని బీసీ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌ పిలుపునిచ్చారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీసీ సెల్‌ క్యాలయం, వ్యవసాయ కళాశాల అనుబంధ సెమినార్‌ హాల్‌ను ఆయన శుక్రవారం ప్రారంభించారు. 60 సంవత్సరాలుగా యూనివర్సిటీలో బీసీ విభాగం లేదంటూ ఇపుడు బీసీ ఉద్యోగస్తులు, విద్యార్థులు అందరు కలిసే విధంగా బీసీ విభాగం ఏర్పాటు చేసుకున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు. బలహీన వర్గాల ప్రాతినిధ్య కోసం జరుగుతున్న పోరాటంలో రాజకీయ పార్టీలు మాత్రమే పాల్గొంటున్నాయన్నారు. ఈ యూనివర్సిటీలో బీసీ విభాగం ఎలా ఏర్పాటు చేసుకున్నామో అలాగే ప్రతి సంస్థ, కార్యాలయాల్లో బీసీ విభాగం ప్రారంభించాలని సూచించారు. ఈ యూనివర్సిటీలో బీసీ విభాగానికి అన్ని సౌకర్యాలు కల్పించడానికి స్థానిక శాసనసభ్యులు రూ.10 లక్షలు ఇచ్చేందుకు సహకరిస్తున్నారని తెలిపారు. విద్యార్థి నాయకుడిగా అనేకసార్లు ఈ యూనివర్సిటీకి వచ్చానని, ఇప్పుడు మంత్రిగా ఇక్కడ పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. వీసీి జానయ్య ప్రభుత్వం మొత్తాన్ని ముఖ్యమంత్రి, మంత్రులను ఇక్కడికి తోసుకొచ్చారు.. తమ ప్రభుత్వం వ్యవసాయ యూనివర్సిటీకి ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో యూనివర్సిటీ ఉండాలని చర్యలు తీసుకుంటున్నాం.. వ్య్రవసాయం అభివృద్ధిలో బాగంగా శాస్త్రవేత్తల పరిశోధనలు రైతుల వరకు చేరాలి.. వ్యవసాయ కళాశాలలకు రవాణా సమస్యలు తొలగిస్తాం.. బీసీ స్కాలర్‌ షిప్‌ విషయంలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం.. మారుతున్న కాలానికనుగుణంగా శాస్త్రవేత్తల సలహాలు, ఆధునిక యాంత్రీకరణపై అన్ని రకాల సలహాలతో వ్యవసాయం పండగలాగా జరగాలని మంత్రి పొన్నం అన్నారు.

కాళ్లలో కట్టెలు పెట్టకండి

చట్టం 3,4 చదవండి.. ఎక్కడా మత రిజర్వేషన్లు లేవు.. మీరే శాసనసభలోలో మద్దతు ఇచ్చారు.. ఇప్పుడు మీరే మోకలడ్డుతున్నారు.. నోటికాడి ముద్ద లాగొద్దని విజ్ఞప్తి చేస్తున్న.. కాళ్ళల్లో కట్టెల పెట్టి ఆపే ప్రయత్నం చేయవద్దు అని బీజేపీనుద్దేశించి అన్నారు. చట్టంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లుపై మాత్రమే ఉంది.. మత రిజర్వేషన్లు లేవు.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వస్తె విద్యావకాశాలు, ఉద్యోగావకాశాలు పెరుగుతాయి.. అని మంత్రి పొన్నం అన్నారు. కార్యక్రమంలో బీసీ కమిషన్‌ చైర్మన్‌ నిరంజన్‌, రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌, వీసీ అల్దాస్‌ జానయ్య, బీసీ సెల్‌ ఇన్‌చార్జి డాక్టర్‌ దామోదర్‌ రాజు, ప్రొఫెసర్లు, బీసీ సంఘాల విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *