పకడ్బందీగా కొనసాగుతున్న మహా జాతర

– అవసరమైన వారికి తగిన వైద్య సహాయం అందేలా ఏర్పాట్లు
– అధికారులతో జాతరను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం
– రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి
– కుటుంబంతో క‌లిసి అమ్మ‌ల ద‌ర్శ‌నం

మేడారం, ప్రజాతంత్ర, జనవరి 29: తెలంగాణ కుంభమేళా మేడారం మహా జాతర పకడ్బందీగా కొనసాగుతున్నది. సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణను ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నదని రెవెన్యూ, హౌసింగ్, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కుటుంబ సమేతంగా అమ్మవార్లను దర్శనం చేసుకుని మొక్కులు సమర్పించుకున్నారు. వారి వెంట జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ దివాకర టీఎస్ ఉన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మేడారం జాతర ఏర్పాట్లను గురువారం ఉదయం బైక్‌లపై తిరుగుతూ జిల్లా కలెక్టర్ దివాకర, ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. జంపన్న వాగు వద్ద భక్తుల స్నానాలకు గల ఏర్పాట్లను, పరిసర ప్రాంతాల పారిశుధ్యాన్ని స్వయంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ జాతర సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పెద్ద ఎత్తున భక్తులు వచ్చే మహా జాతరలో తప్పిపోయిన వ్యక్తులను తిరిగి వారి కుటుంబానికి చేర్చేందుకు తప్పిపోయిన వ్యక్తుల ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశామన్నారు. మహా జాతర సందర్భంగా పారిశుధ్య చర్యలు కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నామన్నారు. జాతరలో పారిశుధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చిన ప్రభుత్వం ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగిస్తున్నదని చెప్పారు. మేడారం పరిసరాలతోపాటు దర్శనానికి వెళ్లే అన్ని సెక్టార్లలో పరిశుభ్రత పాటిస్తున్నామన్నారు. అమ్మవారి గద్దెల వద్ద శానిటేషన్ సిబ్బందితో ప్రత్యేక పారిశుధ్య చర్యలు చేపట్టామన్నారు. అధికారులు నిరంతర ంపర్యవేక్షిస్తూ గద్దెల వద్ద బెల్లం, భక్తులు సమర్పించే మొక్కలు ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *