మాడవీధుల ప‌నుల‌ పురోగతిని పరిశీలించిన మంత్రి పొంగులేటి

వరంగల్, ప్రజాతంత్ర, జనవరి 7: వరంగల్ లో ప్రసిద్ధ భద్రకాళి అమ్మవారిని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం దర్శించుకున్నారు. దేవాల యంలో నిర్మాణంలో ఉన్న మాడవీధుల అభివృద్ధి ప‌నుల‌ పురోగతిని పరిశీలించారు. ఆలయానికి విచ్చేసిన మంత్రికి ఆలయ ఈవో సునీత, ధర్మకర్తలు, అర్చకులు వేద స్వస్తి, మంగళవా ద్యాలతో ఘన స్వాగతం పలికారు. మంత్రి శ్రీనివాసరెడ్డి వెంట ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎంపీ కడి యం కావ్య, మేయర్ గుండు సుధారాణి, హనుమకొండ, కలెక్టర్లు స్నేహ శబరిష్. సత్య శారద దేవి, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, కుడా అధికారులు అజిత్ రెడ్డి,భీమ్రావు, శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, దొంతి మాధవరెడ్డి, కెఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, డిసిపి లు శుభం ప్రకా ష్, మనీషా తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజానంతరం ఆలయ మహా మండపంలో  మహాదాశీర్వచనం నిర్వహించి శేష వస్త్రాలు బహూకరించి అమ్మవారి ప్రసాదములు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, ఓరుగంటి పూర్ణచందర్, మయూరి రామేశ్వరరావు, గాండ్ల స్రవంతి, జారతి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *