– మాకు తెలియకుండానే సర్వే చేయించారు
– రాత్రికి రాత్రే బుల్డోజర్లతో గోడలు కూల్చారు
– మంత్రి పొంగులేటిపై బాధితుడు సతీష్ షా ఆరోపణ
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 30: తమ భూములను ఇవ్వాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన తనయుడు హర్షారెడ్డి తమ ఇంటికి వచ్చి బెదిరిస్తున్నారని వట్టినాగులపల్లి భూ బాధితులు సతీష్ షా ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాలతో 1969 నుండి 2025 వరకు తమ భూములకు ఎలాంటి ఇబ్బంది లేదు.. నాటి నుండి భూమిలో తామే ఉన్నామన్నారు. మొదట పొంగులేటి హర్షారెడ్డి మా ఇంటికి వచ్చాడు. తరువాత వాళ్ళ తండ్రి శ్రీనివాస్ రెడ్డి కూడా వచ్చాడు. మొదట మమ్మల్ని రెండుమూడు ఎకరాలు అడిగారని చెప్పారు. తరువాత మొత్తం భూములు ఇవ్వమని, అడిగితే తాము అందుకు తిరస్కరించామని చెప్పారు. ఆ తర్వాత సర్వేయర్ శ్రీనివాస్ మకు తెలియకుండానే తమ భూములు సర్వే చేశారు. ఇప్పుడు తాము కూర్చున్న భూమి కూడా తమవే అని పొంగులేటి కుమారుడు చెప్తున్నాడు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే భూ పంచనామా చేశారు. అయన చేసిన సర్వే పంచనామాను హైకోర్టు సస్పెండ్ చేసింది. నవీన్ మిట్టల్, పొంగులేటి కుమారుడు హర్ష ఈ భూముల కోసం మీటింగ్స్ పెట్టుకున్నారు. ఇదంతా జరుగుతున్న సమయంలో ఒక రోజు రాత్రికి రాత్రి జేసీబీ తెచ్చి గోడలు కూల్చి కబ్జాకు ప్రయత్నం చేశారు. కూల్చింది రాఘవా కన్ స్ట్రక్షన్ అని తెలిసింది. మొత్తం 5 సార్లు మాపై దాడి చేసారు. ప్రాణాలు తీస్తామని బెదిరిస్తున్నారు. మా భూములు మమ్మల్ని వాడుకోమని కోర్టు ఆదేశాలు ఉన్నా పోలీసులు అడ్డుకుంటున్నారు. పోలీసులు పట్టించుకోవడం లేదు, పోలీసులు ప్రభుత్వ ఒత్తిడిలో ఉన్నారని సతీష్ షా వెల్లడించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



