– 10 రోజుల్లో.. 249 వార్డుల్లో ప్రచారం
– 70 శాతం సక్సెస్ రేటుతో 174 వార్డుల్లో గెలుపు
– ఉమ్మడి ఖమ్మం, వరంగల్ పురపాలికల్లో హస్తం ప్రభంజనం
ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 : మున్సిపల్ ఎన్నికల కురుక్షేత్రంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (శీనన్న) ఒక అజేయ శక్తిగా నిలిచారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పగించిన బాధ్యతను సవాలుగా తీసుకున్న ఆయన తన వ్యూహ చతురతతో ఫలితాలను తలకిందులు చేశారు. కేవలం అంకెలే కాదు.. ఆ అంకెల వెనుక ఉన్న ఆయన కష్టం, ప్రచారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం 10 రోజుల్లోనే అసాధ్యమనుకున్న సమీకరణాలను సుసాధ్యం చేసి చూపారు. తన సొంత గడ్డపై మంత్రి పొంగులేటి గాలివాటం కాదు.. సునామీ సృష్టించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఆయన అడుగుపెట్టిన ప్రతిచోటా కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది. ఏదులాపురం : 32 వార్డుల్లో ఏకంగా 24 చోట్ల జయకేతనం ఎగురవేసి సత్తా చాటారు. కొత్తగూడెం కార్పొరేషన్ : సింగరేణి హృదయంలో 22 స్థానాలను కైవసం చేసుకున్నారు. కల్లూరు & సత్తుపల్లి: కల్లూరులో 12, సత్తుపల్లిలో 17 వార్డులను హస్తం ఖాతాలో వేశారు. ఇల్లందు&అశ్వారావుపేట : ఇల్లందులో 19, అశ్వారావుపేటలో 17 స్థానాల్లో గెలిచి తన పట్టును నిరూపించుకున్నారు. ఓరుగల్లు కోటపై కాంగ్రెస్ జైత్రయాత్ర : ఉమ్మడి వరంగల్ జిల్లా బాధ్యతలను స్వీకరించిన శీనన్న, అక్కడ కూడా ప్రత్యర్థుల కోటలను బద్ధలు కొట్టారు. భూపాలపల్లి : అత్యంత కీలకమైన ఈ మున్సిపాలిటీలో 16 వార్డులను గెలుచుకుని పట్టు సాధించారు. పరకాల & స్టేషన్ ఘన్‌పూర్ : పరకాలలో 13, స్టేషన్ ఘన్‌పూర్‌లో 13 స్థానాలను గెలిపించారు. మొత్తంగా మంత్రి పొంగులేటి ప్రచారం నిర్వహించిన 249 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ 174 స్థానాలను గెలుచుకుంది. అంటే సుమారు 70 శాతం గెలుపు రేటుతో ఆయన ఛాంపియన్ గా నిలిచారు. పగలు రేయి ఏకంచేసి ఆయన సాగించిన సుడిగాలి పర్యటనలు, రేవంతన్న సంక్షేమ పథకాలపై ప్రజలకు కల్పించిన భరోసా ఓట్ల వర్షంగా కురిసింది. మాట ఇస్తే తప్పని నైజంతో, అభివృద్ధిపై ఉన్న నిబద్ధతతో శీనన్న ప్రజాప్రభుత్వంలో తన మార్క్ రాజకీయాలను మరోసారి చాటి చెప్పారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





ఈ ఫలితాలు ముమ్మాటికీ రెఫరెండమే