– రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన
– సంక్రాంతి రద్దీకి ప్రత్యేక బస్సులు
హైదరాబాద్, ప్రజాతంత్ర,జనవరి 6: రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సెలవులను ప్రకటించింది. ఈనెల 10 నుంచి 16వ తేదీ వరకు అన్ని పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. ఈ సెలవులు ప్రభుత్వ, ప్రైవేటు, వాణిజ్య పాఠశాలలకు వర్తిస్తాయని పేర్కొంది. 16న కనుమ రోజును పురస్కరించుకుని ఐచ్ఛిక సెలవు కూడా ప్రభుత్వం ప్రకటించింది. కనుమ రోజున రైతులు తమ పండుగను ప్రత్యేకంగా చేసుకుంటారు. కనుమ రోజున ఉత్సవాలు, పండుగ సంబరాలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. 17వ తేదీ నుంచి అన్ని పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది. ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హాస్టళ్లలో ఉండే విద్యార్థులను తమ ఇళ్లకు తీసుకురావడానికి తల్లిదండ్రులు ప్లాన్ చేసుకుంటున్నారు.
ప్రత్యేక బస్సులు
సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఏపీ, తెలంగాణ జిల్లాలకు ఆర్టీసీ బస్సులు నడుపుతుందని రంగారెడ్డి రీజియన్ మేనేజర్ శ్రీలత తెలిపారు. ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ప్రత్యేక బస్సులను నడుపుతామని అన్నారు. ఈ మేరకు స్పెషల్ ఆపరేషన్స్‌పై మహాత్మాగాంధీ బస్టాండ్‌లో పోలీస్, ట్రాఫిక్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. బస్సులపై వారికి సూచనలు చేశారు. ఈ సందర్భంగా శ్రీలత మాట్లాడుతూ రాయలసీమ వైపు వెళ్లే బస్సులు ఆరాంఘర్.. ఉత్తర తెలంగాణకు జేబీఎస్.. విజయవాడ, నల్లగొండ, ఖమ్మం ప్రాంతాలకు ఎల్‌బీనగర్ నగర్ నుంచి ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



