జంట జలాశయాల్లో కాలుష్యంపై విచారణ

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాల కాలుష్యంపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ జలాశయాల్లో మురుగు, పరిశ్రమల వ్యర్థాలు చేరి నీళ్లు కలుషితమవుతున్నాయంటూ ఓ వార్తాపత్రికలో వచ్చిన కథనాన్ని సుమోటోగా తీసుకున్న సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. తాగునీటి జలాశయాల్లో వ్యర్థాలు చేరడంపై ఉన్నత న్యాయస్థానం జలమండలిని ప్రశ్నించింది. జలమండలి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, నీటిపారుదల శాఖ, జీహెచఎంసీని ప్రతివాదులుగా చేర్చింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆ సంస్థలను ఆదేశించింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *