నేతల ఆట వోటు కదరా
నేతల ఆశ సీటు కదరా
గెలుపు కొరకు
సామాన్యుడు
దేవుడై పోతాడు కదరా
వీధిని బట్టి టోపీ
గుడిని బట్టి ఆహార్యం
రకరకాల అవతారాలు
మోస వ్యవహారాలే కదరా
విచిత్ర చిత్రాలు
సత్యాసత్యాలు
స్వపుత్రిక పత్రికలో
ఎన్నెన్ని చిత్ర కథనాలు కదరా
కప్పలు సర్పాల
ద్విపాత్రాభినయనాలు
నక్కల తోడేళ్ళ
అంతర్రూపాలు
అన్నీ పదవీ అవతారాలే కదరా…
చేతలు నోరు పరాధీనం
రాతలుపూతలు పరాధీనం
బెల్లం కొట్టిన రాయి
బడుగు సామాన్య బతుకు కదరా
కదను తొక్కరు
కలసి నడవరు
సోమరివి సోంభేరివి
ఎండినమోడు పండని బీడు
దెప్పిపొడుపులు
ఎన్నాళ్ళు సహిస్తారు
జనహితం కొరకు
సమాజ హితం కొరకు
కదలండిరా కడలి తుపాను లా
కలల కన్న స్వేచ్ఛ రాజ్యం కొరకు
– రేడియమ్‌
9291527757

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *