ఏపీ కేంద్రంగా బీజేపీ కుట్రలు.!?

“తెలంగాణలో నమోదైన కేసులను ప్రభుత్వం అనుమతి లేకుండా డైరెక్ట్‌ సీబీఐ విచారణ చేసే అకాశం లేదు..మనీ లాండరింగ్‌, అవినీతి అభియోగాలు లేకుండా ఈడీ ఎంటర్‌ కాదు.అయితే ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మనీలాండరింగ్‌ లేదు.అవినీతి లేదు..కాబట్టి సీబీఐ, ఈడి ఎంటర్ అయి కేటీఆర్‌ను అరెస్ట్‌ చేసే చాన్స్‌ లేదు..కానీ ఏపీలో ఫోన్ ట్యాపింగ్‌ జరిగిందని కేసు నమోదు చేసి సీబీఐకి అప్పగించి, అది తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసుతో లింకులున్నాయని చెప్పడం ద్వారా..తెలంగాణ ఫోన్ ట్యాపింగ్‌ కేసును బీజేపీ తన కోర్ట్‌లోకి తెచ్చుకునే కుట్రలు జరిగాయని చర్చ జరుగుతుంది.”

తెలంగాణలో బీజేపీకి బీఆర్ఎస్ కొరకరాని కొయ్యాగా మారింది.తెలంగాణను  సౌత్‌లో ఎంట్రికి ఉపయోగించుకోవాలని అనుకుని కాషాయ పార్టీ భంగపడ్డది.కానీ బీఆర్ఎస్ ప్రజా బలం ముందు మోదీ, షా బలం సరిపోలేదు.తెలంగాణపై బీజేపీకి ఆశ చావలేదు..సెక్యూలర్‌ రాజకీయాలకు కేంద్రమైన తెలంగాణలో గెలవాలన్న సంకల్పంతో రేవంత్‌ వంటి వారిని ముందుపెట్టి ఒకే టైంలోనే బీఆర్ఎస్‌ను, కాంగ్రెస్‌ను బలహీనపర్చే ఎజెండాను కమలం పార్టీ అమలు చేస్తుంది. తెలంగాణలో కేసీఆర్‌ పేరు బద్నాం చేయకుండా..ప్రజల్లో బీఆర్ఎస్‌ ను విలన్‌గా చిత్రికరించకపోతే రాష్ట్రంలో బీజేపీ గెలిచే అవకాశం లేదు. చంద్రబాబు,పవన్‌, రేవంత్‌ ఇలా లీడర్సేకాదు ఎన్డీయే మిత్రపక్షాలన్ని కట్టగట్టుకుని వచ్చిన బీజేపీకి అధికారం అందగని దాక్షగానే మిగిలిపోతుంది.దీంతో ఫోకస్ ఏపీకి మార్చింది..ఏపీలో ఎన్డీయే కూటమి పేరుతో సౌత్‌లో బీజేపీ అడుగుపెట్టింది.

తెలంగాణలో రేవంత్‌ రెడ్డి సీఎం కాగానే..ఏపీలో రాజకీయ సమీకరణలు మారిపోయాయి. జగన్‌తో మిత్రుత్వాన్ని కోరుకున్న బీజేపీ..తెలంగాణలో రేవంత్ సీఎం కాగానే ఉన్న ఫలంగా మోదీ, షాలు చంద్రబాబుతో కాళ్ల బేరానికి వచ్చారు..అప్పటి వరకూ మతం, ఉత్తర దక్షిణా అంటూ రాజకీయాలు చేసిన పవన్‌ ఒక్కసారిగా సనాతధర్మ ప్రధాన ప్రచారకుడు అయ్యాడు.  అయితే ఏపీలో విస్తరించిన ఈజీగా తెలంగాణలో బీజేపీ విస్తరించడం బీజేపీ కత్తిమీద సాములాంటిదే..రేవంత్‌ రెడ్డి మద్దతు లేకుండా బలం పెంచుకోవడం కాషాయ పార్టీతో కాదు..అదే సమయంలో కేసీఆర్‌ వంటి బలమైన ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడు ఉన్నంత కాలం బీజేపీ, రేవంత్‌ వ్యూహాలు పని చేయవని మోడీ, షాలకు తెలుసు..ప్రత్యేక్షంగా బీఆర్ఎస్‌ ఢీ కొట్టేంత బలంగా తెలంగాణలో బీజేపీ లేదు..దీంతో ఏపీలో జగన్‌ కుటుంబంలో చిచ్చుపెట్టినట్లే..తెలంగాణలో బీఆర్‌ఎస్‌లో చిచ్చుపెట్టే ప్రయత్నం  బీజేపీ చేసింది.ఇందుకోసం సీమాంధ్ర మీడియాను ప్రచాస్త్రంగా మార్చుకుంది.

ఎమ్మెల్యేల కోనుగోలు కేసులో బీజేపీని, వోటు నోట్ కేసులో రేవంత్‌ను, చంద్రబాబును కేసీఆర్‌ ప్రజల ముందు దోషుల నిలబెట్టారు..బీఎల్‌ సంతోష్‌ను అరెస్ట్‌ చేస్తామంటూ బీజేపీకి చెమటలు పట్టించారు..దీంతో ఈ ముగ్గరి ఉమ్మడి శత్రువు  కేసీఆర్‌ అయ్యారు.. ఎలాగైనా కేసీఆర్‌ను కేటీఆర్‌ను తన గుప్పిట్లే పెట్టుకునేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తుంది…అయితే బీఆర్ఎస్‌కు రాష్ట్రంలో బలమైన జనబలం, ఉద్యమ నేపథ్యం, గ్రౌండ్‌లో బలమైన పునాదులు, బలమైన క్యాడర్‌ ఉండటంలో బీజేపీ ఎత్తులన్నీ బూమరాంగ్ అవుతున్నాయి అన్నిటికి మించి తెలంగాణలో ప్రతి అంశంపై అవగహాన, ప్రజలు ఏం కావాలో తెలిసిన కేసీఆర్‌ లాంటి టవరింగ్‌ పర్సనాలిటి ఉన్న లీడర్‌ ఉండటంతో రాష్ట్రంలో  రేవంత్‌, ఎన్డీయే కూటమి కుట్రలు భగ్నం అవుతున్నాయి.

కేసులు పెట్టి వేధిస్తున్నా. కుటుంబంలో  చిచ్చులుపెట్టిన..విలీనం అంటూ ప్రాపగండా చేసినా..బీఆర్ఎస్‌ రోజు రోజుకు బలపడుతుంది తప్ప బలహీనపడే పరిస్థితులు కనిపించడం లేదు..అటు గులాబీ పార్టీ కూడా నిండాముగినిగాక ఇక చలి ఎక్కడిదన్నట్లు జాతీయ పార్టీలతో ఢీ అంటూ ఢీ అన్నట్లు వ్యవహరిస్తుంది..రాజకీయ పార్టీ నుంచి మళ్లీ ఉద్యమ పార్టీ రూపాంతరం చెందుతుంది. బీఆర్ఎస్‌ అగ్ర నేతలను అరెస్ట్‌ చేసేంత పెద్ద కేసులు లేకపోవడం..కేసీఆర్‌ను, కేటీఆర్‌ను గుప్పిట్లో పెట్లుకునే అవకాశం బీజేపీ కోల్పోయింది.దిల్లీ లిక్కర్ కేసులో కవిత పై ఈడీ, సీబీఐ కేసులో వేధించవచ్చని అనుకున్న బీజేపీకి కవిత తన వ్యవహరశైలితో షాక్‌లు ఇస్తుంది..ఇప్పుడు కవితను అడ్డుపెట్టుకుని కేసీఆర్‌ కుటుంబాన్ని, బీఆర్ఎస్‌ను వేధించే అవకాశం లేకుండా కవిత వ్యూహత్మంగా అడుగులు వేస్తుంది.దీంతో కాంగ్రెస్‌ జనతా పార్టీ ట్యాపింగ్ కేసు ఎత్తుకుంది..

రేవంత్, బీజేపీ కుట్రలను బీఆర్ఎస్‌ సక్సెస్‌గా తిప్పికొట్టడం, ఫోన్‌ ట్యాపింగ్, ఫార్మూలా ఈ రేస్‌, కాళేశ్వరం కమిషన్‌ నివేదికలపై పింక్‌ పార్టీ రాజకీయంగా, న్యాయ బద్ద పోరాటానికి సిద్దం కావడం.. కేసీఆర్‌, కేటీఆర్‌ అరెస్ట్‌కు  హైకమాండ్ అంగీకరించకోపోవడంతో రేవంత్‌ ఇరాకటంలో పడ్డారు..దీంతో బీజేపీ రూట్‌ మార్చి చంద్రబాబు ఆధ్వర్యంలో కేసీఆర్‌, కేటీఆర్‌  అరెస్ట్‌కు కుట్రలు జరుగుతున్నాయని రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది.

కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌ రావును అరెస్ట్‌ చేసేందుకు చాన్స్‌ లేకపోవడంతో ఏపీ కేంద్రంగా బీజేపీ, చంద్రబాబు పక్క స్కేచ్‌ వేస్తున్నారని తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్‌ కేసును రేవంత్‌, బీజేపీ అస్త్రంగా మార్చుకున్నారన్న వాదన ఉంది..కేటీఆర్‌ను అరెస్ట్‌ చేసేందుకు ఏపీ కేంద్రంగా కుట్రలు జరుగుతున్నాయని దిల్లీలో హైలెవల్‌ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసును తెలంగాణ ప్రభుత్వం పరిధి నుంచి కేంద్రం పరిధిలోకి తీసుకువచ్చేందుకు ఏపీ కేంద్రంగా మోదీ , చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారని, రేవంత్‌ రెడ్డి పరోక్షంగా సహకరిస్తున్నారన్న చర్చ ఉంది.

ఫోన్ ట్యాపింగ్‌ కేసును అడ్డుపెట్టుకుని కేసీఆర్‌ను తన గుప్పింట్లో పెట్టుకునేందుకు ఆ కేసును  సీబీఐకి ఇవ్వాలని బీజేపీ పదేపదే డిమాండ్ చేస్తుంది..అదే సమయంలో కేసును సీబీఐకి ఇచ్చే ఉద్దేశ్యం కాంగ్రెస్‌లో కనిపించడం లేదు..కేసు సీబీఐ చేతికి ఇస్తే రాష్ట్రంలో బీజేపీ బలపడేందుకు వాడుకుంటుందని, అది కాంగ్రెస్‌కు నష్టం చేస్తుందని ఏఐసీసీ ఆలోచిస్తుంది..కేసును సీబీఐకి ఇవ్వాలని రేవంత్‌ రెడ్డి మనసులో ఉన్నప్పటీకి సీఎం కుర్చి  రేవంత్‌ను వెనక్కిలాగుతుంది.

అంతేకాదు, ఎలగైన కేసును తన చేతుల్లోకి తీసుకునేందుకు  సిట్‌ విచారణపై నమ్మకం లేదంటూ బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు..రాష్ట్ర పరిధిలో ఉండే  సీట్ పై బీజేపీకి నమ్మకం లేదు సరే..మరి సీబీఐపై దేశ ప్రజలకు నమ్మకం ఎలా ఉంటుంది..?..ఇప్పటి వరకూ దేశంలో సీబీఐ క్లోజ్ చేసిన కేసులెన్నీ..దోషులకు శిక్ష వేసింది ఎందరికి..ఏళ్ల తరబడి పెండింగ్‌లో పెడుతూ రాజకీయ ఎదుగుదలకు సీబీఐలను వాడుకుంది నిజం కాదా..సీబీఐ కేంద్రం పంజరంలో చిలుక అని సుప్రీం కోర్ట్‌ ఊరికే వ్యాఖ్యానించిందా.?

అంతేకాదు ప్రీ ప్లాన్ ప్రకారం ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుల్లో అనుహ్యంగా చంద్రబాబు, ఏపీ టీపీపీసీ చీఫ్‌ షర్మిల పేర్లను తెరపైకి తీసుకువచ్చారు..ఏపీ లిక్కర్‌ కేసులో సంచలన విషయాలంటూ ఫోన్‌ ట్యాపింగ్ కేసుతో లింకు పెట్టే ప్రయత్నం చేశారు..చంద్రబాబు, షర్మిల ఫోన్లు ట్యాప్‌ చేశారని సీమాంధ్ర మీడియా ప్రచారం చేసింది.ట్యాపింగ్  కేసు రేవంత్‌ కోర్ట్‌ నుంచి బీజేపీ కోర్ట్‌లో తీసుకునే ఎత్తులు వేస్తూ తెరపైకి చంద్రబాబు, షర్మిల అంటూ రెండు పార్టీ అధ్యక్షుల పేర్లను తీసుకువచ్చారన్న వార్తలు వస్తున్నాయి..ఫోన్‌ ట్యాపింగ్‌పై ఏపీలో కేసు పెట్టించే  కుట్రలు జరిగాయట.

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసుకు అనుబంధంగా..ఏపీలో చంద్రబాబు  ఫోన్ కూడా ట్యాప్‌ జరిగిందని చెప్పుతూ కేసు పెట్టి తెలంగాణ కేసుతో ఏపీ ట్యాపింగ్‌  కేసును సీబీఐకి అప్పగించి. తెలంగాణలో సీబీఐని ఎంటర్‌ చేసే కుట్రలకు అడుగులు పడ్డట్లు చర్చ జరుగుతుంది.ఈడీ, లేకపోతే సీబీఐ కేసులో కేటీఆర్‌ను అరెస్ట్‌ చేసే కుట్రలకు పునాదులు పడ్డాయని ప్రచారం జరిగింది..ఈ క్రమంలోనే ఏపీ లిక్కర్‌ కేసులో తెలంగాణ ఫోన్‌ ట్యాపింగ్‌ నిందితులతో లింకుపెట్టే ప్రయత్ననాలు జరిగాయి.

తెలంగాణలో నమోదైన కేసులను ప్రభుత్వం అనుమతి లేకుండా డైరెక్ట్‌ సీబీఐ విచారణ చేసే అకాశం లేదు..మనీ లాండరింగ్‌, అవినీతి అభియోగాలు లేకుండా ఈడీ ఎంటర్‌ కాదు.అయితే ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మనీలాండరింగ్‌ లేదు.అవినీతి లేదు..కాబట్టి సీబీఐ, ఈడి ఎంటర్ అయి కేటీఆర్‌ను అరెస్ట్‌ చేసే చాన్స్‌ లేదు..కానీ ఏపీలో ఫోన్ ట్యాపింగ్‌ జరిగిందని కేసు నమోదు చేసి సీబీఐకి అప్పగించి, అది తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసుతో లింకులున్నాయని చెప్పడం ద్వారా..తెలంగాణ ఫోన్ ట్యాపింగ్‌ కేసును బీజేపీ తన కోర్ట్‌లోకి తెచ్చుకునే కుట్రలు  జరిగాయని చర్చ జరుగుతుంది.

మాజీ ఇంజనీర్ల అవినీతి కేసులను అడ్డుపెట్టుకుని కాళేశ్వరంలో కూడా అవినీతి జరిగిందని..జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌పై విచారణను ఏసీబీ అప్పగించేందుకు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై బీజేపీ ఒత్తిడి బలంగా ఉన్నట్లు తెలుస్తుంది.కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కమిషన్‌ నివేదికపై ఏసీబీ కేసు నమోదు చేస్తే ఆటోమెటిగ్‌గా ఇందులో ఈడీని ఎంటర్‌ చేసి ఏసీబీ నుంచి కేసును ఈడీ టేకోవర్‌ చేసుకునే రేవంత్‌ రెడ్డి, బీజేపీలు కుట్రలు చేస్తున్నాయన్న గుసగుసలు సచివాలయంలో జరుగుతుంది.. అంతేకాదు, కేసీఆర్‌ను, కేటీఆర్‌ను, హరీష్‌ రావును రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్‌ చేస్తే..రాష్ట్రం అగ్ని గుండం అవుతుందని కాంగ్రెస్‌ పార్టీ నేతలే రేవంత్‌ రెడ్డిని డైరెక్ట్‌గా హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్‌ హైకమాండ్ కూడా కేసీఆర్ , కేటీఆర్‌లను  అరెస్ట్‌ చేయోద్దని రేవంత్‌కు గతంలో కేటీఆర్‌ ఏసీబీ విచారణకు హజరైనప్పుడే హెచ్చరినట్లు వార్తలు వచ్చాయి.

.అటు, కేసీఆర్‌ అరెస్ట్‌ చేసిన బద్నాం రాష్ట్రంలో కాంగ్రెస్‌పైకి రాకుండా..అదే సమయంలో కేసీఆర్‌ అరెస్ట్‌ చేసే టార్గెట్‌ను రేవంత్‌ రెడ్డి వదులుకోలేక..వ్యూహత్మంగా కేసీఆర్‌ను అరెస్ట్‌ చేససి ఆ బద్నాం బీజేపీపై నెట్టేందుకు  తన సొంత ఎజెండాను అమలు చేస్తున్నారు. కేసీఆర్‌ను అరెస్ట్‌ చేయాలన్న ఉద్దేశ్యం తమ ప్రభుత్వానికి లేదని చిట్‌ చాట్‌లో చేసిన వ్యాఖ్యలు ఈ కోవలోకే వస్తుంది..కేసులను కేంద్రానికి అప్పగించే ఉద్దేశ్యంతోనే కేసీఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వానికి అరెస్ట్‌ చేసే ఉద్దేశ్యం లేదని నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఫోన్ ట్యాపింగ్‌ కేసు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ విచారిస్తుంది. కేసు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం కోర్ట్‌లోనే ఉంది..ఫోన్ ట్యాపింగ్‌లో కేసీఆర్‌ కేటీఆర్‌ పాత్ర ఏమీ లేదని, అది ప్రభుత్వ ఆధికారులు చేసే రోటిన్‌ పని అని కేంద్ర ప్రభుత్వం సహా తెలంగాణ ప్రభుత్వం కూడా అంగీకరించడంతో ట్యాపింగ్‌ కేసు నీరుగారిపోతుంది..సిట్ సహజంగా ప్రభుత్వం చెప్పే దాన్ని తూట తప్పకుండా నివేదికలో ఇస్తుంది..సహజంగా ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఏదో ఒకటి చేసి కేసీఆర్‌, కేటీఆర్‌ను దోషులుగా నిలబెట్టాలని రేవంత్‌ రెడ్డి విఫల ప్రయత్నం చేస్తున్నారు..అయితే ప్రభుత్వానికి అనుకూలంగా సిట్ నివేదిక ఇచ్చినా..అది కోర్ట్‌లో నిలబడే అవకాశం లేదు..కాంగ్రెస్‌ చర్యలు తీసుకునేపరిస్థితి కనిపించడం లేదు..ఎందుకంటే  ట్యాపింగ్‌ ప్రభుత్వంలో అంతర్గభాగం అని ప్రకటిస్తున్నాయి.

అయితే కేసీఆర్‌ కుటుంబాన్ని కేసులతో ఇబ్బంది పెట్టేందుకు అటు రేవంత్‌ ఇటు బీజేపీలు పోటీ పడుతున్నాయి..ఫోన్ ట్యాపింగ్‌ కేసును ఇద్దరు అస్త్రంగా మార్చకుంటున్నారు. అయితే ఇద్దరి ఎజెండా ఒక్కటే కావడంతో పోటీపడుతున్నాయి. అయితే ఈ ప్రతికార రాజకీయాల్లో ఎవరు విజేతలుగా నిలుస్తారో.. ఎవరు దోషులుగా నిలబడుతారో 2028 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇస్తారు.

-తోటకూర రమేష్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *