– రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20 : తెలంగాణలో నమోదైన తొమ్మిది గుర్తింపు లేని రాజకీయ పార్టీలు చట్టపరమైన నిబంధనలు పాటించకపోవడంతో ఎన్నికల సంఘం వాటిని రద్దు (డిలిస్టింగ్) చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. రద్దయిన పార్టీలలో ఆల్ ఇండియా ఆజాద్ కాంగ్రెస్ పార్టీ, ఆల్ ఇండియా బీసీ ఓబీసీ పార్టీ, బీసీ భారత దేశం పార్టీ, భారత్ లేబర్ ప్రజా పార్టీ, లోక్‌సత్తా పార్టీ, మహాజన మండలి పార్టీ, నవభారత్ నేషనల్ పార్టీ, తెలంగాణ ప్రగతి సమితి, తెలంగాణ ఇండిపెండెంట్ పార్టీ ఉన్నాయి. ఈ పార్టీలన్నీ ఎన్నికల సంఘం వద్ద నమోదైనప్పటికీ గుర్తింపు పొందలేదని ప్రజాస్వామ్య ప్రతినిధుల చట్టం`1951 ప్రకారం తప్పనిసరి నివేదికలు, లెక్కలు సమర్పించకపోవడంతో ఎన్నికల సంఘం వాటిని రద్దు చేసిందని వివరించారు. రద్దయిన పార్టీలు ప్రధానంగా హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలకు చెందినవేనని తెలిపారు. ఈ నిర్ణయాన్ని జీహెచ్‌ఎంసీ కమిషనర్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లకు పంపించామని, వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించామని సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను కాపాడడమే లక్ష్యమని స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



