– శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే అభివృద్ధి
– సమస్య గుర్తిస్తే సగం సమస్య పరిష్కారమైనట్టే
– ఇతర మెట్రోపాలిటన్ సిటీల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి
– పెరిగిపోతున్న సైబర్ క్రైమ్ నేరాలు
– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
– తెలంగాణ పోలీస్ ఆఫీసర్ల ‘రిట్రీట్-2026′
హైదరాబాద్, ప్రజాతంత్ర,మార్చి
ఇప్పుడు నేర స్వరూపమే మారిపోయింది 
ఒకప్పుడు తీవ్రవాదం ఒక సమస్యగా ఉండేది.. ఇందుకోసం ఆక్టోపస్, గ్రేహౌండ్స్ లాంటి వ్యవస్థలు తీసుకొచ్చారు. అవినీతిని నిరోధించేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఫిజికల్ క్రైం నిరోధించేందుకు ఇప్పటివరకు వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఇప్పుడు నేర స్వరూపమే మారిపోయింది. సైబర్ క్రైం పెరిగిపోతున్న ఈ రోజుల్లో మన సిస్టంను అప్ గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సాంకేతిక నైపుణ్యం ఉన్న అధికారులను నియమించుకోవాల్సిన అవసరం ఉంది. ఉన్నసిబ్బంది, అధికారులను అప్ గ్రేడ్ చేసుకోకపోతే నేరాలను నిరోధించలేమని అన్నారు. రిట్రీట్ కార్యక్రమం ద్వారా సమస్యలను గుర్తించి విశ్లేషించుకున్నారు. సమస్య ఏమిటో గుర్తిస్తే 50 శాతం సమస్య పరిష్కారం అయినట్లే. సైబర్ క్రైం, నార్కోటిక్స్, రిక్రూట్‌మెంట్, ఇతర అంశాలకు సంబంధించి వివిధ సమస్యల పరిష్కారానికి కొన్ని ప్రతిపాదనలు చేశారు. ఈ ప్రతిపాదనలపై విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక అధికారుల కమిటీ ఏర్పాటు చేస్తాం.. ప్రతిపాదనలపై కమిటీలో విశ్లేషించి చట్టం రూపంలో మా ముందుకు తీసుకురండి. సాధ్యాసాధ్యాలను పరిశీలించి ప్రభుత్వం దానిపై నిర్ణయం తీసుకుంటుంది. పోలీస్ శాఖలో సిబ్బంది రేషనలైజేషన్ చేసుకుని జనాభా ప్రాతిపదికన పోలిసింగ్ ఉండేలా ప్రణాళికలు రూపొందించాలి. పోలీస్ శాఖలోని వివిధ విభాగాల మధ్య సమన్వయ లోపం లేకుండా చూసుకోవాలి. పోలీస్ శాఖలో ఉద్యోగులు ఆటో మోడ్ కు వెళితే సమాజానికి అత్యంత ప్రమాదకరం. ఇతర శాఖల్లా పోలీస్ శాఖలో ఆటో మోడ్.. ఆటో ప్రమోషన్ ఉండదు. పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ అవ్వాల్సిందేనని అన్నారు. అవసరమైన నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంది. పనితీరు ఆధారంగానే పోస్టింగులు ఉంటాయి. ఏటా డిసెంబరులో రిట్రీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసునేలా ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. బడ్జెట్ ప్రవేశపెట్టకముందే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటే అవసరమైన నిధులను బడ్జెట్‌లో కేటాయించుకోవచ్చుని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సీఎంకు పోలీస్ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో డీజీపీ శివధర్ రెడ్డి, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




