– పీడించే వారిని ప్రజలు ఉపేక్షించరు
– పర్యవేక్షణ అధికారులు ఖచ్చితంగా పనిచేయాలి
– ఎస్.ఐని అరెస్టు చేసిన ఏసీబీ పనితీరు భేష్ : డీజీపీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 19: మెదక్ జిల్లాలోని టేక్మల్ సబ్-ఇన్స్పెక్టర్ను అవినీతి ఆరోపణలపై పకడ్బందీగా అరెస్టు చేసిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) బి.శివధర్ రెడ్డి బుధవారం అభినందించారు. ఏసీబీ డీజీ చారు సిన్హాతోపాటు ఏసీబీలోని ఇతర అధికారులు, సిబ్బందిని ప్రత్యే కంగా ప్రశంసించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ అవినీతిపరులైన పోలీసు అధికా రులు, సిబ్బందిని ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించ వద్దని ఏసీబీకి సూచించారు. లంచం తీసుకు న్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టేక్మల్ పోలీస్ స్టేషన్ సబ్-ఇన్స్పెక్టర్ను ఏసీబీ అధికా రులు అరెస్టు చేసిన అనంతరం స్థానిక ప్రజలు సంబరాలు చేసుకున్న సంఘటనపై పోలీసు అధికారులు, సిబ్బంది తమ పనితీరుపై స్వీయ సమీక్ష చేసుకోవాలని డీజీపీ సూచించారు. లంచం తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొం టున్న పోలీసు అధికారి అరెస్టుపై స్థానిక ప్రజలు పటాకులు కాల్చి బహిరంగంగా సంబురాలు జరుపుకొనే సంఘటన ప్రజల నుండి ఒక బలమైన సందేశాన్ని పంపుతుంద నిఆయన అభిప్రాయపడ్డారు. ఆ సంఘటన పోలీసుల పట్ల ప్రజల విశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





