ఎల్లంప‌ల్లి వ‌ద్ద పోలీసు సిబ్బందికి భ‌వ‌నాలు

– ప్రారంభించిన డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి

నిర్మ‌ల్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 4: నిర్మల్ జిల్లాలో గురువారం డీజీపీ శివధర్ రెడ్డి  తన పర్యటనలో భాగంగా ఎల్లంప‌ల్లి వద్ద పోలీస్ అధికారులు, సిబ్బంది కోసం నూతనంగా నిర్మించిన భవనాలను ప్రారంభించారు. అనంతరం నూతన జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ నూతనంగా నిర్మించిన ఈ ఆధునిక భవనాలు పోలీసు సిబ్బందికి మెరుగైన పనిస్థలం, నివాస వాతావరణం అందించడమే కాకుండా, జిల్లాలో సేవల నాణ్యతను పెంచేందుకు దోహదపడతాయని అన్నారు. నిర్మల్ పోలీసింగ్ రాష్ట్రంలో ఆదర్శంగా నిలవాలని, ప్రజా సేవలో మరింత నిబద్ధతతో పనిచేయాలని అన్ని స్థాయి అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి తో పాటు, ఎం.ఎల్.ఏ మహేశ్వర్ రెడ్డి, ఐ.జి.పి(పి అండ్ ఎల్)ఎండీ.టి.జి.పి.హెచ్.సి రమేష్, జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్,పోలీస్ అధికారులు, జిల్లా ఉన్నతాధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *