పలువురు పోలీస్‌ ‌సిబ్బంది పదవీ విరమణ

– ఉద్యోగులను సత్కరించి అభినందించిన కమిషనర్‌

‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, జనవరి 1: గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ ‌పోలీస్‌ ‌కషనరేట్‌ ఆడిటోరియంలో గురువారం జరిగిన పదవీ విరమణ చేసిన పోలీసు సిబ్బందిని సైబరాబాద్‌ ‌పోలీస్‌ ‌కషనర్‌ ‌డాక్టర్‌ ‌యం. రమేష్‌, ‌జాయింట్‌ ‌సీపీ డాక్టర్‌ ‌గజరావు భూపాల్‌,‌పూలమాలవేసి శాలువతో ఘనంగా సన్మానించి ఆత్మీయ వీడ్కోలు తెలిపారు. అనంతరం పదవీ విరమణ చేసిన సిబ్బందికి పెన్షన్‌ ‌పత్రాలను అందజేశారు.పదవీ విరమణ చేసిన వారిలో.. శంషాబాద్‌ ‌జోన్‌ ఏడీసీపీ కె. పూర్ణ చందర్‌, ‌మైలార్‌ ‌దేవ్‌ ‌పల్లి పోలీస్‌ ‌స్టేషన్‌ ‌సబ్‌ ఇన్‌ ‌స్పెక్టర్‌ ‌కె సత్యా కుమార్‌, ‌సీఏఆర్‌ ‌హెడ్‌ ‌క్వార్టర్స్ ఏఆర్‌ఎస్‌ఐ ‌జి. వెంకటేశ్వర్లు ఉన్నారు.  పదవీ విరమణ పొందిన అధికారుల కుటుంబ సభ్యులు, సహచరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఆత్మీయ వేడుకలా మార్చారు. రిటైర్‌ అయిన సిబ్బంది డిపార్ట్‌మెంట్‌ ‌తో తమ అమూల్యమైన అనుభవాలను పంచుకున్నారు.  ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పోలీస్‌ ఉద్యోగ నిర్వహణలో సుధీర్ఘకాలంగా అంకిత భావంతో పనిచేసి పదవీ విరమణ చేస్తున్న సిబ్బందికి అభినందనలు తెలిపారు.  జీవితంలో ముఖ్యంగా ప్రతి మనిషి కృతజ్ఞతా భావం కలిగి ఉండాలన్నారు. పోలీసులు విధుల్లో తీరిక లేకుండా ఉన్నప్పటికీ, కుటుంబ బాధ్యతలను నిర్వర్తించే మహిళలను అభినందిస్తూ సీపీ భావోద్వేగానికి లోనయ్యారు. సమాజంలో ఆన్‌లైన్‌ ‌బెట్టింగ్‌  ‌పెద్ద వ్యసనంగా తయారయ్యిందన్నారు. బెట్టింగ్‌ ‌వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. కొత్తగా వచ్చిన బిఎన్‌ఎస్‌ఎస్‌ ‌చట్టలపై పోలీస్‌ ‌సిబ్బంది అవగాహన పెంచుకోవాలని సూచించారు. పోలీస్‌ అధికారులు బదిలీలు జరిగినప్పుడు వారు కో-ఆపరేటివ్‌ ‌సొసైటీలో జమ చేసుకున్న డబ్బు తీసుకోవడానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని తమ దృష్టికి వచ్చిందన్నారు. త్వరలోనే ఇతర కషనరేట్‌ ‌కో-ఆపరేటివ్‌ ‌సొసైటీలతో అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) కుదుర్చుకుని సమస్య పరిష్కరిస్తామన్నారు.  అనంతరం జాయింట్‌ ‌సీపీ డాక్టర్‌ ‌గజరావు భూపాల్‌, ఐపిఅఎస్‌ ‌మాట్లాడుతూ… మన నడవడిక ను బట్టే మన పిల్లలు అనుసరిస్తారన్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతూ.. తమ అనుభవాన్ని సమాజ సేవకు వినియోగించాలని సూచించారు. రిటైర్‌ ‌మెంట్‌ ‌డబ్బును భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆచితూచి ఖర్చు చేయాలన్నారు.  రిటైర్మెంట్‌ అనేది కేవలం ఉద్యోగానికే, కానీ పదవీ విరమణ చేసిన వారు సైతం పోలీస్‌ ‌డెపార్ట్ ‌మెంట్‌ ‌కు అనుబంధంగా పని చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో శంషాబాద్‌ ‌డీసీపీ బి. రాజేశ్‌, ఎస్‌ ‌బీ డిసిపి వైవీఎస్‌  ‌సుధీంద్ర, విమెన్‌ అం‌డ్‌ ‌చిల్డ్ర ‌సేప్టీ వింగ్‌ ‌డీసీపీ సృజన కర్ణం,  అడ్మిన్‌ ఏడీసీపీ ఎండీ ఎఫ్‌. ‌రెహ్మాన్‌, ‌సీఏఆర్‌ ‌హెడ్‌క్వార్టర్స్ ఏడీసీపీ షర్‌, ఎస్బీ ఏసీపీ ప్రకాష్‌, ‌సీటీసీ ఏసీపీ గంగారం, సీఏఓ (అడ్మిన్‌) ‌గీత, సీఏఓ (అకౌంట్స్) ‌వెంకట్‌ ‌రెడ్డి, ఎస్టేట్‌ ఆఫీసర్‌ ఆర్‌ఐ ‌హిమాకర్‌, ‌సైబరాబాద్‌ ‌పోలీస్‌ ‌సహకార సంఘం ఇన్‌ ‌చార్జ్  ‌జి.  మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
—————————————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *