– క్షమాపణ చెప్పాలని పోలీసు అధికారుల సంఘం డిమాండ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 12: డీజీపీ శివధర్‌రెడిపై ఎమ్మెల్యే కె.టి.రామారావు చేసిన అనుచిత, అసభ్య వ్యాఖ్యలను రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఒక వార్తా ఛానల్‌కు ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ డీజీపీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అసభ్యంగా, అనుచితంగా, అనాగరికంగా ఉన్నాయని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.గోపిరెడ్డి పేర్కొన్నారు. డీజీపీ నాయకత్వంలో ఎన్నడూ లేనంత అప్రమత్తతతో తెలంగాణ పోలీసు పనిచేస్తున్న విషయం ప్రజలకు తెలుసునని, తాము చట్టానికి, ప్రజలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. పోలీసు శాఖ నిష్పక్షపాతంగా పనిచేస్తున్నదని, శాంతిభద్రతలు కాపాడడానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. కేటీఆర్ ప్రస్తావించిన అన్ని సంఘటనల్లో పోలీసులు చట్ట ప్రకారం కేసులు రిజిస్టర్ చేశారని ఆయన తెలిపారు. దోపిడీ, హత్యల కేసుల్లో అత్యంత వేగంగా నిందితులను పట్టుకున్నామని, పోలీసుల పనితీరులో ఆక్షేపించవలసింది ఏమీ లేదని అన్నారు. ఒకవేళ ప్రశ్నించాల్సి వస్తే సంస్కారయుతంగా, సభ్యతతో చేయాలని గుర్తు చేస్తున్నామన్నారు. రాజకీయ ప్రేరేపిత సంఘటనలను దృష్టిలో పెట్టుకుని డీజీపీని ఉద్దేశించి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని, పత్రికా ముఖంగా క్షమాపణ చెప్పాలని కేటీఆర్‌ను గోపిరెడ్డి డిమాండ్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




