– కేంద్ర మంత్రి రహమత్ నగర్ సభకు అనుమతి నిరాకరణ
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 7: రహమత్ నగర్‌లో శుక్రవారం సాయంత్రం నిర్వహించనున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ మీటింగ్‌కు పోలీసులు అనుమతి నిరాకరించారు. రహమత్ నగర్‌లో మీటింగ్ నిర్వహించుకోవడానికి మాజీ మంత్రి కేటీఆర్‌కు అనుమతి ఇచ్చిన పోలీసులు కొద్దిసేపటి క్రితం బీజేపీ నేతలకు అనుమతి ఇవ్వడం లేదని సమాచారమిచ్చారు. పోలీసుల తీరుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక అనుమతి ఇవ్వడం లేదని ఇప్పుడు చెప్పడమేంటని మండిపడ్డారు. ఈనెల 4న దరఖాస్తు చేసుకుంటే ఇప్పటిదాకా నాన్చడం వెనుక మతలబు ఏందని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కటే అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలన్నారు. బీఆర్‌ఎస్ సభకు అనుమతి ఇస్తూ తమ సభలకు ఇబ్బందులు కలిగించడమేంటి అని నిలదీశారు. బీజేపీ సభలకు పర్మిషన్ ఇస్తే ఒక వర్గం ఓట్లు పోతాయనే భయం కాంగ్రెస్‌కు పట్టుకుందని ఆయన అన్నారు. జూబ్లిహిల్స్ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు… కర్రు కాల్చి వాత పెట్టడం తథ్యం అన్నారు. కాగా, గురువారం కూడా బోరబండలో నిర్వహించుకునే ముందు అనుమతి నిరాకరించగా బీజేపీ నేతలు, కార్యకర్తల ఆగ్రహంతో పొద్దుపోయాక సభ నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చిన విషయం విదితమే.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




