2047 లక్ష్యంగా పోలీస్ శాఖ కార్యాచరణ

– డీజీపీ శివధర్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష
– ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047’ సన్నాహాలపై దిశానిర్దేశం
– సైబర్, ఫోరెన్సిక్ సామర్థ్యాలపై దృష్టిసారించాలని ఆదేశం

హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 1 : రాష్ట్ర భవిష్యత్తు ప్రణాళికలో కీలకం కానున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047’ సన్నాహాలపై రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ (డీజీపీ) బి.శివధర్ రెడ్డి సోమవారం అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావే శంలో డీజీపీ అధికారులకు కీలక వ్యూహాత్మక దిశానిర్దేశం చేశారు. ‘గ్లోబల్ సమ్మిట్ 2047’ కార్యక్రమాన్ని నిర్దేశిత సమయంలోనే కాకుండా, దశాబ్దం ముందుగానే అనేక లక్ష్యా లను సాధించాల్సిన అవసరం ఉందని డీజీపీ స్పష్టం చేశారు. ఈ సమ్మిట్ను డిసెంబర్ 8, 9 తేదీల్లో ప్యూచర్ సిటీలో నిర్వహించనున్నారు. ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలు, దౌత్యవేత్త లు, పెట్టుబడిదారులు హాజరుకానున్నారు. సాంకేతిక ప్రదర్శన: సమ్మిట్లో రాష్ట్ర పోలీ సుల సాంకేతిక సామర్థ్యాలు, వినూత్న కార్యక్ర మాలు ప్రజల కేంద్రంగా పనిచేసే వ్యవ స్థలను సమర్థవంతంగా ప్రదర్శించి, భద్రత, రక్షణపై ప్రజల్లో విశ్వాసాన్ని పటిష్టం చేయాలని డీజీపీ ఆదేశించారు. ఫోరెన్సిక్ ఎవిడెన్స్ యాక్ట్ను ప్రవేశపెట్టడంపై ఒక ముసాయిదా ప్రతిపాదనను సిద్ధం చేయా లని సూచించారు. టెక్నాలజీ డెవలప్మెంట్ యూనిట్ ఏర్పాటు చేయాలని, ఇన్నోవేషన్ ఇంక్యుబేటర్ల కోసం టీ-హబ్లో ఒక హ్యాకథా నేను కూడా నిర్వహించాలని అభిప్రాయపడ్డా రు. తెలంగాణ స్టేట్ సైబర్ బ్యూరో (టీజీసీఎ సి) డైరెక్టర్ శిఖా గోయెల్ మాట్లాడుతూ, తెలంగాణ పోలీసులను సైబర్, ఫోరెన్సిక్ సామర్థ్యాలలో అంతర్జాతీ య స్థాయికి తీసుకె ళ్లడానికి రూపొందించిన రోడ్మ్యప్ను వివ రించారు. ఆర్థిక సైబర్ క్రైమ్ ఫిర్యాదుల కోసం పూర్తిగా ఏఐ-ఆధారిత ‘డయల్ 1930’ వ్యవ స్థను అమలు చేయడం, సైబర్ ఫోరెన్సిక్ హ బ్లను విస్తరించడం ముఖ్య లక్ష్యాలుగా పేర్కొ న్నారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, టెలికాం ఆపరేటర్లను అనుసం ధానిస్తూ ‘సైబర్ కమాండ్ & ఫ్యూజన్ గ్రిప్’ ప్లాట్ఫారమ్ను సృష్టించ డం, రియల్ టైమ్లో మోసాలను గుర్తించే అటానమస్ ఫ్రాడ్ హం టింగ్ సిస్టము ఏర్పా టు చేయడం వంటి ప్రతిపాదనలు చేశారు. ఈగల్ ఫోర్స్ డైరెక్టర్, భవి ష్యత్తు పోలీసింగ్ కార్యక్రమాలను తెలియజేస్తూ, రోబోటిక్స్, ఏఐ-ఆధారిత వ్యవస్థలపై దృష్టి సారించే ప్రత్యేక ‘పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్’ యూని ట్లను, ‘పోలీస్ రోబోటిక్స్ ఆర్గనైజేషన్’ను స్థా పిం చనున్నట్లు తెలిపారు.సోషల్ మీడియా ధోరణులు, డార్క్-వెబ్/క్రిప్టో కార్యకలాపాల ను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఐజిపి (పి & ఎల్) ఎం రమేష్ మాట్లాడుతూ, 2047 నాటికి రాష్ట్రం 3 ట్రిలి యన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకోవడంలో పోలీస్ వ్యవస్థదే కీలక పాత్ర అని స్పష్టంచేశారు. శాంతిభద్రతల పరిరక్షణ ద్వారానే పెట్టుబ డులకు భద్రతాభా వం కలిగి కీలక రంగాలు వృద్ధి చెందుతాయని తెలిపారు. ఈ లక్ష్య సాధ న కోసం పోలీస్ శాఖ తమ బలా లు, బలహీ నతలపై లోతైన స్వీయ సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. సామర్థ్యం, జవాబుదారీతనం, పారదర్శకత ఆధారంగా ‘మైత్రీ పూర్వక పోలీ సింగ్’ విధానాన్ని అమలు చేయడం ద్వారా ప్రజల సహకా రాన్ని పెంచు కుని, భవిష్యత్ కార్యాచరణకు పటిష్టమైన పు నాది వేయాలని ఆయన ఉద్ఘా టించారు. ఈ సమావేశంలో అదనపు డీజీపీ లు, ఐజీపీలు, డీఐజీ, ఎస్పీలు, డీసీపీలు వీడి యో కాన్ఫరెన్స్ ద్వారా తమ అభిప్రాయాలను డిజిపికి తెలియజేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *