వీరు ఆదర్శ ఆటగాళ్లు ఎలా అవుతారు?

– సురేశ్‌ ‌రైనా, శిఖర్‌ ‌ధావన్‌లపై కమిషనర్‌ ఆ‌గ్రహం

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబరు 7: ప్రజాభిమానాన్ని వ్యాపారంగా మలచుకోవడం దారుణమని క్రికెటర్లు సురేశ్‌ ‌రైనా, శిఖర్‌ధావన్‌పై హైదరాబాద్‌ ‌పోలీసు కమిషనర్‌ ‌సజ్జనార్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. బెట్టింగ్‌ ‌యాప్‌లకు బ్రాండ్‌ అం‌బాసిడర్లుగా ఉంటూ వీరు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకున్నారని మండిపడ్డారు. ప్రేక్షకుల అభిమానాన్ని సొమ్ము చేసుకునే వీళ్లు ఆదర్శ ఆటగాళ్లు ఎలా అవుతారని ప్రశ్నించారు. బెట్టింగ్‌ ‌మహమ్మారికి ఎందరో యువకులు బలవుతున్నారు. వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వేల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సమాజాన్ని ఛిద్రం చేస్తోన్న బెట్టింగ్‌ ‌భూతాన్ని ప్రచారం చేసిన వీరు వీటన్నింటికీ బాధ్యులు కారా అని అన్నారు.  సమాజ మేలు కోసం, యువత ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి నాలుగు మంచి మాటలు చెప్పండి. అంతే కానీ మిమ్మల్ని అభిమానించే వాళ్లను తప్పుదోవ పట్టించి.. వారి ప్రాణాలను తీయకండి అని ఎక్స్‌లో సజ్జనార్‌ ‌పోస్టు పెట్టారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *