– మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు
హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 12: రైతుల యూరియా కష్టాలను చూపిస్తే మీడియాపై కేసులు పెడతారా? అణచివేతలు, ఆంక్షలతో జర్నలిస్టులను భయపెడుతారా? అని కాంగ్రెస్ సర్కార్‌ను మాజీ మంత్రి హరీష్ రావు నిలదీశారు. రైతులు పడుతున్న యూరియా కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన ఖమ్మం రిపోర్టర్ సాంబశివరావుపై పోలీసులు అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గం అని మండిపడ్డారు. రైతుల సమస్యలను తెలుసుకునేందుకు వెళ్లిన జర్నలిస్టుపై పోలీసులు ఉల్టా కేసులు పెట్టడం రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనం. గడిచిన 2 నెలలుగా రైతులు యూరియా కోసం అష్టకష్టాలు పడుతుంటే పట్టించుకోని ప్రభుత్వం.. ప్రభుత్వ నిర్లఁ్‌యాన్ని ఎత్తి చూపుతున్న డియా ప్రతినిధులపై కేసులు పెట్టడం శోచనీయం. శాంతిభద్రతల నిర్వహణను పక్కన పెట్టి ప్రజల గొంతు నొక్కేందుకు పోలీసులను వాడడం అప్రజాస్వాకం. జర్నలిస్ట్ సాంబశివరావుపై పెట్టిన కేసులను తక్షణం ఉపసంహరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, డీజీపీని డిమాండ్ చేస్తున్నాం అని హరీష్ రావు పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




