కాశ్మీర్‌ నుండి కన్యాకుమారి వరకు పోలీస్ అథ్లెట్‌ సైక్లింగ్

జాతీయ స్థాయిలో నిర్వహించిన కాశ్మీర్‌ నుండి కన్యాకుమారి వరకు” సైకిల్ యాత్ర లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పోలీస్ సైక్లింగ్ అథ్లెట్ పాల్గొన్నారు. యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో, ఫిట్ ఇండియా మూవ్‌మెంట్ తో అనుబంధంగా, ఎ రైడ్ ఫర్ యూనిటీ పేరుతో నిర్వహిస్తున్న ఈ సైక్లింగ్ యాత్రను నిర్వహిస్తున్నారు. భారత దేశ ఐక్యతకు ప్రతీకగా అయిన సర్దార్ వల్లభ్‌భాయి పటేల్ 150వ జయంతి సందర్భంగా ఈ సైకిల్ యాత్రను నిర్వహించారు. రెగల్లా గోపీ, పి సి 3360, సి ఏ ఆర్ ఖమ్మం యూనిట్‌కు చెందిన పోలీసు సిబ్బంది. సైక్లింగ్ విభాగంలో ప్రతిభను చాటుకుంటూ ఈ ప్రతిష్ఠాత్మక జాతీయ స్థాయి సైక్లింగ్ యాత్రలో పాల్గొన్నారు. పోలీస్ సేవలో క్రమశిక్షణ, ధైర్యం, మానసిక దృఢత్వంతో పాటు శారీరక సామర్థ్యాన్ని నిరూపించేలా గోపీ పాల్గొనడం రాష్ట్ర పోలీస్ శాఖకు గర్వకారణంగా నిలుస్తుందని ఐజీపీజీపీ స్పోర్ట్స్ ఎం రమేష్, స్పోర్ట్స్ డీఎస్పీ ఆర్ వి.రామ రావు, ఆర్ఐ. మధులు కానిస్టేబుల్ గోపిని ప్రశంసించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *