– జలశక్తి కమిటీ ముందు తెలంగాణ డిమాండ్
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జనవరి 30 : కేంద్ర జల వివాదాల పరిష్కార కమిటీ సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటలపాటు ఈ భేటీ జరిగింది. అజెండాలో 12 అంశాలు చేర్చాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. పోలవరం, నల్లమలసాగర్ ప్రాజెక్టును అజెండాలో పెట్టవద్దని కోరింది. టైబ్యునల్ తీర్పు వచ్చే వరకు 50 శాతం వాడుకునే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. తెలంగాణ అధికారులు లేవనెత్తిన పలు అంశాలపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. వారంలోగా అజెండా అంశాలు ఖరారు చేసి లిఖితపూర్వకంగా ఇవ్వాలని సీడబ్ల్యూసీ ఛైర్మన్ తెలిపారు. అజెండా అంశాలు ఖరారయ్యాక భేటీ తేదీని ఖరారు చేస్తామని ఛైర్మన్ స్పష్టం చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నదీ జలాల నిర్వహణ, వినియోగం విషయంలో కొనసాగుతున్న వివాదాల పరిష్కారానికి కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేసిన కమిటీ తొలి సమావేశం శుక్రవారం ఢిల్లీలో ప్రారంభమైంది. సీడబ్ల్యూసీ చైర్మన్ అనుపమ్ ప్రసాద్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. కమిటీ తదుపరి చర్చల కోసం జల వివాదాలకు సంబంధించిన అజెండా అందజేయాలని కమిటీ సభ్యులను సీడబ్ల్యూసీ చైర్మన్ కోరారు. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, జలవనరుల శాఖ సలహాదారులు, ఇంజనీర్ ఇన్` చీఫ్‌లు, జలవనరుల శాఖ అధికారులు, కేఆరఎమ్‌బీ, జీఆరఎమ్‌బీ చైర్మన్లు, ఎన్‌డబ్ల్యూడీఏ చీఫ్ ఇంజనీర్ హాజరయ్యారు. ఎపీ నుంచి జలవనరుల శాఖ అడ్వైజర్` వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి పలువురు అధికారులు హాజరయ్యారు. అలాగే తెలంగాణ నుంచి ఆదిత్యనాథ్, ఇరిగేషన్ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ అంజద్ హుస్సేన్, కేంద్ర రాష్ట్ర సమన్వయ అధికారి గౌరవ్ ఉప్పల్ హాజరయ్యారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





