కవులు, కళాకారులతోనే తెలంగాణ సాకారం
ఉద్యమకారులను నాటి పాలకులు విస్మరించారు
చదువుకోని అందెశ్రీ రాష్ట్ర గీతం అందించిన ఘనుడు
ఆయన లేకుండా తెలంగాణ ఉద్యమసభలు లేవు
అందెశ్రీ సంస్మరణ సభలో సిఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 22 : తెలంగాణ మలిదశ ఉద్యమంలో కవులు, కళాకారులు కీలక పాత్ర పోషించారని ముఖ్య మంత్రి రేవంత్రెడ్డి అన్నారు. వారే ముందుం డి ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లారని అన్నారు. వారు లేకుంటే తెలంగాణ లేదని అ న్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో ఏర్పా టు చేసిన అందెశ్రీ సంతాప సభలో సీఎం ప్రసంగించారు. ఉద్యమానికి కవులు, కళాకా రులు ఇచ్చిన ఊపుతోనే తెలంగాణ సాకార మైందని, ఇది ఎవరూ కాదనలేని నిజమన్నారు. అంతేగాకాక వారే తెలంగాణ ఉద్య మాన్ని భుజాన వేసుకుని మోసారన్నారు. ఎన్నడూ బడికి వెళ్లని అందెశ్రీ అద్భుతమైన జయజయహే తెలంగాణ పాట రాశారు. బడికి వెళ్ళని అందె శ్రీ రాసిన జయ జయ హే తెలం గాణ గీతం రాసిన చరిత్ర తెలంగాణకు ఉంది అని రేవంత్ తెలిపారు. బాధతో.. ఉద్వేగంతో చెప్తున్నా.. తెలంగాణ రాష్ట్ర ప్రజలు జయ జయ హే తెలంగాణ పాటకు గౌరవం దక్కాలని కో రుకున్నారు. ఉద్యమంలో ప్రతి నాలుక మీద, ప్రతి వేదిక మీద జయ జయ జయహే తెలంగాణ పాట నిలిచింది.. తెలంగాణ గీతం స్ఫూర్తి నింపిన కవులు, రచయితలను కించప రిచే విధంగా గత పాలకుల చర్యలు ఉన్నాయని సీఎం రేవంత్ అన్నారు. అందెశ్రీ పాట లే కుండా తెలంగాణ ఉద్యమంలో ఒక్క సభ కూ డా జరగలేదని గుర్తు చేశారు. ఊరూరా పాట లతో అందెశ్రీ ఉద్యమానికి ఊపిరిలూదారని అన్నారు. కానీ, తెలంగాణ సాకారమైన తర్వాత ఆ పాట మూగబోయింది. ఆయనను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. పాలకుల దృష్టిలో పదేళ్లు మూగబోయి ఉండొచ్చు కానీ ప్రజల గుండెల్లో నిత్యం గానమై నిలిచిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారిని కనుమరుగు చేసే ప్రయత్నం ఆనాడు జరిగిందన్నారు. కవి రాసే పెన్నుల మీద మన్ను కప్పితే అవి గన్నులై మొల కెత్తుతాయ్.. గడీలను కుప్పకూలుస్తాయ్ అన్న నినాదాన్ని అందెశ్రీ నిజం చేశారని సిఎం రేవంత్ అన్నారు. ప్రజలు కోరుకున్న జయ జయహే తెలంగాణను.. రాష్ట్ర గీతంగా ప్రక టించడమే కాకుండా.. ప్రతి బడిలో పాడాలి, పాఠ్య పుస్తకాల్లో రాయాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. తెలంగాణ ప్రజలు ఎంత అమాయకంగా కనిపిస్తారో.. అంత చైతన్యవంతులని తెలంగాణ ఉద్యమమే రుజువు చేసిందన్నారు. ఈ గడ్డ మీద ప్రజలు అహంకారాన్ని, అధిపత్యాన్ని సహించలేరని, అందుకు నడుస్తు న్న చరిత్రే సాక్షాత్కారమని అన్నారు. ఎన్ని వజ్రాలు ఉన్నా.. కోహినూరు వజ్రం ప్రత్యేకం. అలాగే ఎందరు కవులు ఉన్నా..డా. అందెశ్రీ ప్ర త్యేకం అని సీఎం అన్నారు. తెలంగాణ ప్రాం తం ఎంత ప్రేమ చూపిస్తుందో.. అంతే పోరా టాన్ని కూడా చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలు, కవులు, కళాకా రులూ ఎన్నో పోరాటాలు చేశారు.. గతంలో నిజాం సర్కార్ వాళ్ళను సైతం ఎదురొడ్డి పోరా డిన చరిత్ర తెలంగాణకు ఉందని సీఎం చె ప్పారు. గద్దర్, గోరేటి వెంకన్న వంటి ఉద్యమ కారులు తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని రూ పకల్పన చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం జయ జయ హే తెలంగాణ పాటను ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్రంలో ప్రజా పాలన రావాలని అందె శ్రీ, గద్దర్ అన్న లాంటి వాళ్ళ స్ఫూర్తి తోనే ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వారి కుటుంబాలకు అండగా నిలవాలని నిర్ణయం తీసుకున్నాం. వారి కుటుంబాలకు ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన అనంతరం 9 మంది ఉద్యమ కారులను గుర్తించడం జరిగింది. అంతేకాక రాబోయే రోజుల్లో ప్యూచర్ సిటీలో వారి కుటుంబానికి ఇళ్లను నిర్మించి అండగా నిలుస్తాం. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర తెలంగాణ ఉద్యమ కారులది. దేశంలో ఎస్సి వర్గీకరణ అమలు చేసిన చరిత్ర తెలంగాణ రాష్ట్రానిది. వర్గీకరణ అనేది ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యేలా ఉండాలి.. అలాగే సమాజాన్ని ముందుకు నడి పించాలానే ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్రమంత్రి వర్గంలో దళితులకు పెద్ద పీట వేయడం అనేది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆకాంక్షల మేరకే నిర్ణయాలు తీసుకు న్నాం.’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సమా జంలో ఎన్ని వజ్రాలు ఉన్నా కోహినూర్ వజ్రా నిదే అసలైన గొప్పతనం.. అలాగే కళాకారులు ఎంతమంది ఉన్నా అందె శ్రీ అన్న.. కోహినూర్ వజ్రంలా నిలుస్తాడు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
కార్యక్రమంలో మంత్రులు అడ్లూరి ల క్ష్మణ్, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ గోరటి వెంక న్న, ఆచార్య కోదండరాం, మాజీ ఎంపీ వి. హను మంతరావు పలువురు కవులు, గాయ కులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందెశ్రీ చిత్రపటం వద్ద అందరూ నివాళి అర్పించారు. జయజయహేతో సభ మార్మోగింది. అందెశ్రీ అమర్ రహే అన్న నినాదాలు మిన్నంటాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




