– నల్గొండ జిల్లా పోక్సో కోర్టు సంచలన తీర్పు
నల్లగొండ, ప్రజాతంత్ర, ఆగస్టు 26: దళిత మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నల్గొండ జిల్లా పోక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. తిప్పర్తికి చెందిన నిందుడు మహమ్మద్ ఖయ్యూంకు 51 ఏళ్ల శిక్ష విధిస్తూ న్యాయమూర్తి రోజారమణి తీర్పు వెల్లడిరచారు. ఖయ్యూం 2021లో తిప్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో దళిత మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. బాధితురాలు కుటుంబ సభ్యుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఖయ్యూంపై అత్యాచారం కేసు నమోదు చేశారు. ఎస్పీ శరత్ చంద్రపవార్ నేతృత్వంలో నిందితుడిపై న్యాయస్థానానికి ఆధారాలు సమర్పించడంతో నిందితుడు శిక్ష నుంచి తప్పించుకోలేకపోయాడు. అత్యాచారం కేసులో 20 ఏళ్లు, పోక్సో కేసులో 20 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ కేసులో పదేళ్లు, సెక్షన్ 506(మైనర్ బాలికపై బెదిరింపులు) కేసులో మరో ఏడాది శిక్ష విధిస్తూ న్యాయమూర్తి సంచలన తీర్పునిచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్ చానల్‌ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మరిచిపోవద్దు.





