రేపు ముఖ్య‌మంత్రుల‌తో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్

– పశ్చిమాసియా పరిస్థితులపై వివరించే ఛాన్స్

న్యూదిల్లీ, మార్చి 26: పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమయ్యింది. ఈ క్రమంలో అన్ని రాష్టా ల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ శుక్రవారం  వర్చువల్‌గా సమావేశం కానున్నారు. శుక్రవారం సాయంత్రం 6.30గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారితో మాట్లాడనున్న ఆయన పశ్చిమాసియాలో పరిస్థితులు, భారత్ అనుసరిస్తున్న విధానాలను వివరించనున్నట్లు సమాచారం. అదేవిధంగా ఆయా రాష్టా ల సన్నద్ధత, సహకారంపై చర్చించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్టా ల ముఖ్యమంత్రులు మాత్రం ఈ సమావేశానికి దూరంగా ఉండనున్నట్లు తెలిసింది. అయితే ఆయా రాష్టా ల ప్రధాన కార్యదర్శులతో కేబినెట్ సెక్రటరీ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ప్రధాని-సీఎంల వీడియో కాన్ఫరెన్స్‌లో తీసుకున్న వివరాలను సీఎస్‌లకు వెల్లడించి ఆయా రాష్టాల్లో అమలు చేసేలా కేబినెట్ సెక్రటరీ సూచించనున్నట్లు సమాచారం. ఇటీవల పార్లమెంటు ఉభయసభల్లో మాట్లాడిన ప్రధాని మోదీ.. యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంక్లిష్ట పరిస్థితులు దీర్ఘకాలం కొనసాగే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇది పరీక్షా సమయమేనని తెలిపారు. సంక్షోభం నుంచి బయటపడటంలో రాష్టాల్రన్నీ కేంద్రంతో కలిసి టీమ్ ఇండియాలా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రజలు సిద్ధమై ఉండాలని కోరారు. ఈ క్రమంలోనే అన్ని రాష్టాల్ర ముఖ్యమంత్రులతో సమావేశానికి సిద్ధమవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశంలో పశ్చిమాసియా యుద్ధం కారణంగా తలెత్తిన సంక్షోభంపై కీలక సూచనలు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో చమురు, గ్యాస్‌పై విపరీతంగా వదంతులు వ్యాపిస్తున్నాయి. మధ్యప్రాచ్యం యుద్ధం కొనసాగితే ఎదురయ్యే ఇబ్బందులను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై మోడీ దిశానిర్దేశర చేయనున్నారు. గత నెల 28 నుంచి పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతోంది. గల్ఫ్ దేశాల్లోని ఇంధన, గ్యాస్ క్షేత్రాలపై క్షిపణులతో విరుచుకుపడింది. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని కూడా మూసేసింది. దీంతో ప్రపంచ దేశాల్లో చమురు, గ్యాస్ కష్టాలు తీవ్ర స్థాయికి చేరాయి. ఇప్పటికే ఆయా దేశాల్లో అత్యవసర పరిస్థితులు అమలు అవుతున్నాయి. భారత్‌లో కూడా కరోనా కాలం నాటి లాక్‌డౌన్ పరిస్థితులు వస్తాయంటూ పుకార్లు వ్యాప్తి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ అన్ని రాష్టాల్ర ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *