– ప్రధాని మోదీ ఘన నివాళి
న్యూదిల్లీ, జనవరి 23: స్వాతంత్య్ర సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నివాళులు అర్పించారు. భయమెరుగని నాయకత్వానికి, అచంచల దేశ భక్తికి నేతాజీ ప్రతీక అని కొనియాడారు. ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ధైర్యసాహసాలు, పట్టుదలకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రతీక అని, దేశానికి ఆయన సేవలు అనితరసాధ్యమని ప్రశంసించారు. ఆయన జయంతిని యావత్ దేశం పరాక్రమ్ దివస్‌గా జరుపుకుంటోందన్నారు. నేతాజీ రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తారని కొనియాడారు. నేతాజీ జయంతిని పరాక్రమ్ దివస్‌గా కేంద్ర ప్రభుత్వం 2021లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మరుసటి ఏడాది కేంద్ర ప్రభుత్వం న్యూదిల్లీలోని ఇండియా గేట్ వద్ద నేతాజీ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించింది. 2023లో అండమాన్, నికోబార్ దీప సముదాయంలోని 21 ద్వీపాలకు పరమ్ వీర్ చక్ర అవార్డు గ్రహీతల పేర్లను ఖరారు చేసింది. ఇదిలావుంటే దేŠశవ్యాప్తంగా నేతాజీకి ప్రజలు నివాళులర్పించారు. ఆ మహానుభావుడి ధైర్యసాహసాలను గుర్తు చేసుకున్నారు. కాగా, బ్రెజిల్ అధ్యక్షుడు లుల డ సిల్వాకు స్వాగతం పలకడానికి ఎదురు చూస్తున్నానని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వచ్చే నెలలో లుల భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఆయనతో మాట్లాడారు. ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యం సుదఢంగా సాగుతోందని, వచ్చే ఏడాది నూతన శిఖరాలను అధిరోహిస్తుందంటూ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. రెండు దేశాలూ ట్రంప్ టారిఫ్‌ల బారిన పడడంతో ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




