న్యూదిల్లీ, నవంబర్ 17: సౌదీలో జరిగిన దుర్ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు తన సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక ప్రకనటలో పేర్కొన్నారు. రియాద్‌లోని రాయబార కార్యాలయం, జెడ్డాలోని కాన్సులేట్ సాధ్యమైనంత సహాయం అందిస్తున్నాయని, భారత అధికారులు సౌదీ అధికారులతో సన్నిహితంగా ఉన్నారని తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు.
విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ దిగ్భ్రాంతి
సౌదీ అరేబియాలోని మదీనాలో భారతీయ పౌరులకు జరిగిన ప్రమాదంపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ తీవ్ర దిగ్భార్రతి వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ విూడియా వేదికగా ట్వీట్ పెట్టారు. ఈ ప్రమాదంలో మృతులకు సంబంధించిన సమాచారాన్ని వారి కుటుంబాలకు అందించేందుకు రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం, జెడ్డాలోని కాన్సులేట్ పూర్తి సహకారం అందిస్తున్నాయన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని జై శంకర్ ప్రార్థించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





