స్వదేశీ ఉత్పత్తులను వాడండి

– దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహిద్దాం
– ప్రజలకు ప్రధానమంత్రి  మోదీ బహిరంగ లేఖ

న్యూదిల్లీ,సెప్టెంబర్‌ 22: ‌నవరాత్రి మొదటి రోజైన సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు బహిరంగ లేఖను రాశారు. ఈ లేఖలో ఆయన దేశ ప్రజలందరికీ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహి ంచాలని సూచించారు. దుకాణదారులు అందరూ ’భారతదేశంలో తయారు చేసిన’ ఉత్పత్తులను విక్రయించాలని విజ్ఞప్తి చేశారు. ‘మనం గర్వంగా చెప్పుకుందాం – మనం కొనేది స్వదేశీ, మనం అమ్మేది స్వదేశీ’ అని ప్రధాని బహిరంగ లేఖలో పేర్కొన్నారు. దేశంలో నూతన  సంస్కరణలు అమలులోకి రావడంతో తగ్గిన రేట్లు 375 వస్తువులపై వర్తిస్తాయని పేర్కొన్నారు. ఆటోమొబైల్స్ ‌నుంచి రోజువారీ వినియోగ వస్తువుల వరకు ఈ జీఎస్టీ తగ్గింపు జరిగిందని తెలిపారు. జాతినుద్దేశించి ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ఆదాయపు పన్ను సంస్కరణలతో పాటు, నేటి నుంచి అమల్లోకి వచ్చే జీఎస్టీ రేటు సవరణలతో భారతీయులు … 2.5 లక్షల కోట్లు ఆదా అవుతుం దన్నారు. ప్రధాని దీనిని ‘బచత్‌ ఉత్సవ్‌‘ ‌గా అభివర్ణించారు. తగ్గిన జీఎస్టీ రేట్లు పేదలకు, మధ్యతరగతికి గొప్ప ఉపశమనం కలిగిస్తాయని చెప్పారు. ఈ సంస్కరణలతో యువత, రైతులు, మహిళలు, దుకాణ దారులు, వ్యాపారులు, వ్యవస్థా పకులు అందరూ గొప్ప ప్రయో జనం పొందుతారని అన్నారు. పండుగ సీజన్‌లో జీఎస్టీ తగ్గింపు అనేది ప్రజలకు మరింత ఆదా అవుతుందన్నారు. కొత్త జీఎస్టీ విధానం మధ్యతరహా, చిన్న వ్యాపారాలపై చూపే సానుకూల ప్రభావాన్ని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. ఇది పోటీ తత్వాన్ని, ఆర్థిక వ్యవస్థను పెంచుతుందని అన్నారు.జీఎస్టీ తగ్గింపుతో స్నాక్స్, ‌కాఫీ, నెయ్యి, పనీర్‌, ‌వెన్న, కెచప్‌, ‌జామ్‌, ‌డ్రై ఫ్రూట్స్, ఐస్‌ ‌క్రీం వంటి రోజువారీ వినియోగ వస్తువులపై రేట్లు తగ్గుతాయి. టీవీలు, ఎయిర్‌ ‌కండిషనర్లు, వాషింగ్‌ ‌మెషీన్లు వంటి వస్తువులపై కూడా తగ్గిం చారు. ఔషధాలపై 12శాతంనుంచి 5శాతా నికి జీఎస్టీ తగ్గించారు. క్యాన్సర్‌, ‌జన్యుప రమైన, అరుదైన వ్యాధులకు కీలకమైన ప్రాణాలను రక్షించే మందులను పూర్తిగా పన్ను నుంచి మినహాయించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *