To the sisters: సోదరీమణులకు మోదీ శుభాకాంక్షలు

– పిల్లల మధ్య రాఖీ వేడుకలు

న్యూదిల్లీ, ఆగస్టు 9: ప్రధాని నరేంద్రమోదీ (PM Narendra Modi) రక్షా బంధన్‌ (Raksha bandhan) వేడుకలను విద్యార్థులు, ఆధ్యాత్మిక సంస్థ బ్రహ్మకుమారి సభ్యులతో కలిసి జరుపుకొన్నారు. దిల్లీలోని ప్రధాని నివాసంలో శనివారం ఉదయం 7 గంటల సమయంలో పలువురు విద్యార్థులు, బ్రహ్మకుమారి సభ్యులు మోదీకి రాఖీ కట్టారు. అనంతరం ఆయన వారితో కొంతసేపు సరదాగా ముచ్చటించారు. ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. గతేడాది కూడా ప్రధాని ఇలాగే స్కూల్‌ విద్యార్థినులతో రాఖీ కట్టించుకున్న సంగతి తెలిసిందే. అంతకుముందు రాఖీ పండుగను పురస్కరించుకొని దేశ ప్రజలకు మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. సోదర సోదరీమణుల మధ్య అపరిమిత ప్రేమకు ప్రతీక ఈ రక్షా బంధన్‌. ఈ పండుగ విూ బంధాలను మరింత తీపికరంగా చేయాలని, ఆప్యాయత, సామరస్య భావాలను బలోపేతం చేయాలని, ప్రజలంతా ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నా అంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు. అలాగే, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (Amit sha)కూడా ఈ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ సోదరి-సోదరుల మధ్య ప్రేమ, నమ్మకం, రక్షణ వంటి అవినాభావ బంధాన్ని సూచిస్తుందని అన్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath sing) కూడా తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్‌ శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. రాఖీ దారం పవిత్రతకు చిహ్నం మాత్రమే కాదు, సోదరీమణుల గౌరవం, భద్రత, ఆనందం, శ్రేయస్సుకు నిబద్ధత అని గుర్తు చేశారు. ఈ పండగ మనలో రక్షణ స్ఫూర్తిని బలపరచాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఇదే రోజున, దేశ చరిత్రలో మరో ముఖ్యమైన సంఘటన కూడా జరిగింది. అదే క్విట్‌ ఇండియా ఉద్యమం. నేడు 83వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి మోదీ ఆ ఉద్యమంలో పాల్గొన్న ధ్కెర్యవంతులకు నివాళులర్పించారు. బాపు స్ఫూర్తిదాయక నాయకత్వంలో క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న ధీరులందరినీ మనం గుర్తుంచుకుంటామన్నారు. ఆ ఉద్యమం అనేక మంది ప్రజలను స్వేచ్ఛ కోసం ఏకం చేసిందని, మన స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించినట్లు వెల్లడిరచారు. ఆ ధీరుల త్యాగం వల్లే మనం ఈ రోజు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నామని అభిప్రాయపడ్డారు.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *