పార్లమెంట్‌లో వ్యూహంపై మోదీ చర్చలు

న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జూలై21:  పార్లమెంటు సమావేశాల్లో తొలిరోజు గందరగోళ పరిస్థితి నెలకొంది. పహల్గాం దాడి, ఆపరేషన్‌ ‌సింధూర్‌, అహ్మదాబాద్‌ ‌విమాన ప్రమాదాలపై మోడీ స్పందించాలని ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టడంతో గందరగోళం నెలకొంది. ఈ సమయంలోనే ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన పార్లమెంట్‌ ‌హౌస్‌లో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జెపి నడ్డా, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌, ‌న్యాయ మంత్రి అర్జున్‌ ‌మేఘ్వాల్‌, ‌పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ ‌రిజిజు, వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్‌ ‌చౌహాన్‌తోపాటు- పలువురు మంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో సభ అజెండాలు, ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపైన ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. పలు కీలకమైన బిల్లును ఆమోదింపజేసుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపైన చర్చించినట్లు తెలుస్తున్నది. అయితే ఈ సమావేశ అజెండాపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *