న్యూదిల్లీ, ఆగస్టు 2: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత నగదును ప్రధాని మోదీ వారాణసీ నుంచి తాజాగా విడుదల చేశారు. వారాణసి పర్యటనలో భాగంగా ప్రధాని రూ.2,200 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను కూడా ప్రారంభించారు. సేవాపురిలోని బనౌలిలో జరిగిన కార్యక్రమంలో ఈ నగదును అధికారికంగా విడుదల చేశారు. ఈసారి దేశవ్యాప్తంగా 9.7 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా రూ.20వేల కోట్లు బదిలీ అయ్యాయి. ఈ పథకం ద్వారా రైతులకు ఏడాదికి మూడు విడతల్లో రూ.6,000 ఆర్థిక సాయం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. అంతకుముందు 2024 జూన్ 18న ప్రధానమంత్రి మోదీ రూ.9.26 కోట్ల మంది రైతుల ఖాతాలకు సమ్మాన్ నిధిని విడేదల చేశారు.
పీఎం కిసాన్ 20వ విడత నగదు విడుదల





