పీఎం జన్‌మన్‌లో తెలంగాణకు మూడో ర్యాంక్‌

– అవార్డులు ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

న్యూదిల్లీ, అక్టోబర్‌ 17: ప్రధాన మంత్రి జన్‌జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్‌లో తెలంగాణ రాష్ట్రం ఉత్తమ ప్రతిభ కనబర్చి అవార్డులు సాధించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రభుత్వం తరఫున సెక్రటరీ కోఆర్డినేషన్‌ డాక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ అవార్డులను స్వీకరించారు. న్యూదిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో ఆది కర్మయోగి జాతీయ సదస్సు శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి జన్‌మన్‌, ఆదివాసీ కర్మయోగి అభియాన్‌ కింద ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలు, జిల్లాలు, మండలాలు, గ్రామస్థాయి అధికారులను రాష్ట్రపతి సత్కరించారు. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ జాతీయస్థాయి సన్మాన కార్యక్రమం జరిగింది. గిరిజన సాధికారత కార్యక్రమాలు – పీఎం జన్‌మన్‌, ఆది కర్మయోగి అభియాన్‌, జనభాగిరధి, ధర్తి ఆబా జన్‌ భగీదరి అభియాన్‌ కింద ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలు, జిల్లాలు, మంత్రిత్వ శాఖలు, అధికారులకు రాష్ట్రపతి అవార్డులను ప్రదానం చేశారు ప్రధాన మంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్‌లో తెలంగాణ ఉత్తమ పనితీరు కనబరిచి జాతీయ ర్యాంకింగ్‌లో 3వ స్థానంలో నిలిచింది. గిరిజన సమూహాలకు న్యాయం చేయడం, వారు నివసించే ప్రాంతాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పని చేసి మూడో స్థానంలో నిలిచింది. అలాగే తెలంగాణలోని గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ సంస్థ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పద్మ పి.విని సూపర్‌ కోచ్‌లు/రాష్ట్ర మాస్టర్‌ ట్రైనర్‌లలో ఒకరిగా సత్కరించారు.

బెస్ట్‌ పెర్ఫార్మర్స్‌ స్క్రీన్‌ డిస్‌ప్లే

1.ఆదికర్మయోగి అభియాన్‌ – ఆదిలాబాద్‌, నల్గొండ, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం 2.ఉత్తమ ప్రదర్శన సూపర్‌ కోచ్‌/రాష్ట్ర మాస్టర్‌ ట్రైనర్‌ – డాక్టర్‌ కీర్తి
3.ధార్తీ అభా జనభాగిదారి అభియాన్‌ – ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌
కార్యక్రమంలో డా.గౌరవ్‌ ఉప్పల్‌తోపాటు భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్‌ జిల్లాల కలెక్టర్లు జితేష్‌ వి.పాటిల్‌, వెంకటేశ్‌ ధోత్రేలు, ఆదిలాబాద్‌ సబ్‌ కలెక్టర్‌ యువరాజ్‌ మర్మత్‌, ఐటీడీఏ ఏటూరునాగారం ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ చిత్రా మిశ్రా, ట్రైబల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ సముజ్వల పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page