– అమెరికా సుంకాలపై పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు
-సెమికాన్ ఇండియా సదస్సులో ప్రధాని మోదీ
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2: ఎన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ భారత్ 7.8 శాతం వృ ద్ధి రేటును సాధించిందని.. దేశ ఆర్థిక వ్యవస్థ అంచనాలను మించి రాణిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. మంగళవారం దిల్లీలోని యశో భూమిలో నిర్వహించిన సెకాన్ ఇండియా 2025 సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా విధిస్తున్న సుంకా లను ఉద్దేశిస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇతరుల ఆర్థికస్వార్థం వల్ల ప్రపంచ పరిస్థితుల్లో అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత్ మాత్రం స్థిరంగా అభివృద్ధి వైపు ముం దడుగు వేస్తోందన్నారు. ప్రపంచంలోని వివిధ కంపెనీలు మేకిన్ ఇండియా కోసం భారత్‌కు రావాలని.. ప్రపంచం కోసం తయారీలు చేప ట్టాలని పిలుపునిచ్చారు. సెకాన్ ఇండియా 2025 సదస్సులో 40 దేశాల ప్రతినిధులు పాల్గొనడంపై సంతోషం వ్యక్తంచేశారు. తమ ప్రభుత్వ పాలనలో భారత్‌లో రాజకీయ స్థిర త్వం, ఆర్థిక స్థిరత్వం, విధానాల్లో పారదర్శకత వంటి పలు మార్పులు చోటుచేసుకున్నాయని అన్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్.. త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని విశ్వాసం వ్యక్తంచేశారు. ఈ వృద్ధి కేవలం ఒకే రంగానికి పరిమితం కాకుండా అన్నిరంగాల్లో కనిపిస్తోందని మోదీ అన్నారు. ఆర్థిక స్వార్థం వ ల్ల ఎదురయ్యే సవాళ్లు ఎదుర్కొంటామని ప్రధా ని మోదీ అన్నారు.జూన్ త్రైమాసికంలో భారత దేశం బలమైన ఆర్థిక పనితీరును కనబరించిందని ప్రశంసించారు. ఆర్థిక స్వార్థం ద్వారా నడిచే సవాళ్లను దేశం ఎలా ఎదుర్కొందో ఇదే చక్కని ఉదాహరణ అన్నారు. భారత్ 7.8 శాతం వృద్ధి రేటును సాధించిందని.. దేశ ఆర్థి క వ్యవస్థ అంచనాలను మించి రాణిస్తోందన్నా రు. ఇక భారతదేశంలో సెకండక్టర్ భవిష్య త్తును నిర్మించడానికి అంతర్జాతీయ సమాజం సిద్ధంగా ఉందనే స్పష్టమైన సందేశాన్ని సెమికా న్ ఈవెంట్ పంపిందని తెలిపారు. తాము మేడిన్ ఇండియా ఉత్పత్తులను వినియోగిస్తున్న ట్లు ప్రపంచదేశాలన్నీ చెప్పుకొనే రోజు త్వరలో నే రానుందని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలకు భారత్‌పై నమ్మకం పెరిగిందనడానికి ఇదే ఉదాహరణ అని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తం గా పోటీ పెరిగిన తరుణంలోనూ భార త్‌కు ఆదరణ తగ్గలేదన్నారు. భారత్‌పై అమెరికా భారీగా పన్నులు విధిస్తున్న నేపథ్యంలో మోదీ మాటలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రతి పరికరంలో ఇండియన్ మేడ్ చిప్ ఉండాలనేది తమ కల అని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. సెకాన్ ఇండియా 2025 సదస్సులో తొలి ‘మేకిన్-ఇండియా‘ మైక్రో ప్రాసెసర్ చిప్‌లను ప్రధాని మోదీకి ఆయన అందించారు. భారత్ తయారుచేసిన విక్రమ్ 32-బిట్ ప్రాసెసర్‌తోపాటు 4-టెస్ట్ చిప్స్‌ను అందించారు. ఈ తొలి మైక్రో ప్రాసెసర్ చిప్‌ను ఇస్రో సె కండక్టర్ ల్యాబ్ అభివృద్ధి చేసిందన్నారు. వాహక నౌకల్లో కఠిన వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేసేలా దీనిని రూపొందించినట్లు తెలిపారు. సెమీ కండక్టర్ ఎకోసిస్టమ్ పెంపొందించడమే లక్ష్యంగా కేంద్రం చర్యలు తీసుకుంటుందన్నారు. కొన్నేళ్ల క్రితం ప్రధాని దూరదృష్టితో ఆలోచించి.. దీనిని ప్రారంభించినట్లు తెలిపారు. దీంతో కేవలం 3.5 సంవత్సరాల వ్యవధిలో ప్రపంచదేశాలు భారతదేశం వైపు నమ్మకంగా చూస్తున్నాయన్నారు. ప్రస్తుతం దేశంలో ఐదు సెకండక్టర్ యూనిట్ల నిర్మాణం వేగంగా జరుగుతోందని అన్నారు. ఇటీవల జపాన్ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ భారత్-జపాన్ సంయుక్త ఆర్థిక సదస్సు లో ప్రసంగించారు. సెకండక్టర్ల పరిశ్రమల నుంచి స్టార్టప్‌ల వరకూ జపాన్ భారత్‌కు అత్యంత కీలక భాగస్వామిగా ఉందని ప్రధాని పేర్కొన్నారు. జపాన్ సంస్థలు భారత్‌లో 40 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టాయని గుర్తుచేశారు. జపాన్ ప్రధాని ఇషిబాతో ఏఐ, సె కండక్టర్లు, బుల్లెట్ రైలు, పెట్టుబడులే అజెండాగా ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


