– హెచ్‌ఎండీఏ ఖాతాలో మరో రూ.వేయి కోట్లు
హైదరాబాద్,ప్రజాతంత్ర,డిసెంబర్3: కోకాపేట నియోపోలీస్ భూములకు మూడో విడత వేలం పక్రియ ముగిసింది. బుధవారం ప్లాట్ నెంబర్ 19, 20లోని 8.04 ఎకరాలకు అధికారులు ఈ-వేలం నిర్వహించారు. ప్లాట్ నెంబర్ 19లో ఎకరానికి రూ.131 కోట్లు, ప్లాట్ నెంబర్ 20లో ఎకరం రూ.118 కోట్ల ధర పలికింది. 8.04 ఎకరాలకు హెచ్‌ఎండీఏకు రూ.వెయ్యి కోట్ల మేర ఆదాయం సమకూరింది. మొత్తం మూడు విడతల్లో ఆరు ప్లాట్లలోని 27 ఎకరాలకు రూ.3,708 కోట్ల ఆదాయం లభించింది. ఈసారి మొత్తం 44 ఎకరాల భూమిని నాలుగు విడతల్లో హెచ్‌ఎండీఏ వేలం వస్తోంది. కోకాపేట గోల్డెన్ మైల్‌లోని రెండెకరాలు, మూసాపేటలోని 15 ఎకరాలకు ఈనెల 5న ఈ-వేలం వేయనుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.