ఈమధ్య ప్రసారమాద్యాలు పత్రికలు, సోషల్ మీడియాలలో తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకులు బిడ్డలు అని చూస్తున్నాము. సంతానం ఎందుకు పట్టించుకోవడం లేదంటే వారి అవసరాలు తీరిపోయాయి గొప్పగా సంపాదన ఓ స్థాయికి ఎదిగి సంఘంలో గౌరవప్రదమైన హోదాలో ఉంటున్నాం అనే భావన కానీ కని పెంచిన తల్లిదండ్రులను విస్మరించడం శోచనీయమైన విషయం. ప్రస్తుత బిడ్డలు తాము కూడా భవిష్యత్తులో ఇదే పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆలోచించకపోవడం వలనే ఈ పరిస్థితి వస్తున్నది. ఇదే పద్ధతిలో సింగరేణి సంస్థ అవలంబిస్తున్నది… సంస్థ మహోన్నతికి తోడ్పడిన రిటైర్డ్ ఉద్యోగులను విస్మరిస్తున్నది. ఉచిత మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని పదే పదే కోరుతున్న ఫలితం శూన్యం.
సింగరేణి కేంద్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా 41:59 ఆధీనంలో నడుస్తున్న ప్రత్యేక ప్రతిపత్తి గల సంస్థ. వేతన ఒప్పందాలు చట్టరీత్యా బావుల తవ్వకం మూసివేత ఇతరత్రా మాత్రమే కోల్ ఇండియాతో సంబంధం లేని విధంగా సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రమోషన్ పాలసీ అనేక ఉన్నతమైన సౌకర్యాలు కల్పిస్తున్నది. ఇంతే గాక లాభాల వాట కూడా ప్రతి సంవత్సరం చెల్లిస్తున్నారు కానీ రిటైర్డ్ ఉద్యోగులకు వైద్య సౌకర్యాలు కల్పించడానికి కోల్ ఇండియా నియమ నిబంధనలు అడ్డువస్తున్నాయి అని తెలుపుతున్నారు.
ఇది చాలా విచిత్రమైన విషయం.. స్వయంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రజా కార్మిక సంక్షేమానికి మారుపేరైన మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి సూచించినా యాజమాన్యం వైద్య సౌకర్యాలు కల్పించుటకు కనికరించడం లేదు. ఆకాశమే హద్దుగా ఇతర రంగాలలో ప్రవేశించడానికి సంస్థ కృషి చేస్తున్నది కానీ రిటైర్డ్ ఉద్యోగులను కాలిపోయిన బొగ్గు బూడిదగా భావిస్తున్నది. రాష్ట్ర సంక్షేమానికి, అభివృద్ధికి ఇతోదికంగా పాటుపడుతున్న విధంగా రిటైర్డ్ ఉద్యోగులకు ఉచితంగా మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని మనసారా వేడుకొనుచున్నాము ..ప్రస్తుతం సింగరేణి హాస్పిటల్ లలో ఔట్ పేషెంట్ మరియు సిపిఆర్ఎంఎస్ ద్వారా ఎనిమిది లక్షల వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నారు.. అచేతన వ్యవస్థలో ఉన్న మాకు దిన దినం పెరుగుతున్న వైద్య ఖర్చులు సరిపడక జీవిత చివరి రోజులలో అల్లాడిపోతున్నాం ..
దండంరాజు రాంచందర్ రావు
అధ్యక్షుడు
సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ కాప్ర హైదరాబాద్
9849592958





